Sunday, 10 May 2020

Pawan Kalyan: ఓరి సాంబో రాస్కోరా.. ఈ తిక్కకి ఎనిమిదేళ్లు.. నేటికీ అదే ఊపు

పవర్ స్టార్ స్టామినా ఏంటో బాక్సాఫీస్‌కి రుచి చూపిన చిత్రం ‘’. అన్ని సినిమాలు ఓ లెక్క.. ఈ సినిమా లెక్క అన్నట్టుగా తన తిక్కతో బాక్సాఫీస్ లెక్కలు మార్చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న పవన్ కళ్యాణ్‌ని ‘గబ్బర్ సింగ్’‌గా చూపించి పవన్ కళ్యాణ్ మేజరిజంకు సరికొత్త రూపం తీసుకుని వచ్చారు దర్శకుడు హరీష్ శంకర్. ఓరి సాంబో రాస్కోరా... నాక్కొంచి తిక్క ఉంది.. దానికో లెక్క ఉంది అంటూ పదేళ్లకు సరిపడా బాక్సాఫీస్ లెక్కల్ని సెట్ చేసిన ‘గబ్బర్ సింగ్’ వచ్చి మే 11 నాటికి 8 ఏళ్లు. 2012 మే 11 గబ్బర్ సింగ్ విడుదల కావడంతో ట్విట్టర్‌లో గబ్బర్ సింగ్ 8 ఇయర్స్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు. బండ్ల గణేష్ నిర్మించిన ఈ చిత్రం అతన్ని నిర్మాతగా మరో మెట్టు ఎక్కిస్తే.. పవన్ కళ్యాణ్ అభిమానుల గుండెల్లో ‘గబ్బర్ సింగ్‌’గా నిలబెట్టడంతో ఈ సినిమా విడుదల రోజు కావడంతో సోమవారం నాడు ‘గబ్బర్ సింగ్ 8 ఇయర్స్ హ్యాష్ ట్యాగ్’తో ఇంటర్నెట్‌ను షేక్ చేసేందుకు పవన్ ఫ్యాన్స్ ఇప్పటికే హంగామా మొదలుపెట్టారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2yLCceB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...