Saturday, 16 May 2020

సినీ పరిశ్రమలో మరో విషాదం.. అక్షయ్ కుమార్ సమీప బంధువు, హీరో మృతి

బాలీవుడ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవలే ఇర్ఫాన్ ఖాన్, రిషీ కపూర్ లాంటి గొప్ప నటులను కోల్పోయిన చిత్ర సీమ తాజాగా మరో నటుడి మరణ వార్త వినాల్సి వచ్చింది. ఏక్తా క‌పూర్ న‌టించిన 'క‌హానీ ఘ‌ర్ ఘ‌ర్ కీ' సినిమాలో హీరోగా నటించిన గుండె పోటుతో కన్నుమూశారు. మే 13న పుట్టిన రోజు జరుపుకున్న ఆయన అకాల మరణం చెందడంతో ఆయన సన్నిహిత వర్గాలు షాక్ అయ్యాయి. సచిన్ కుమార్.. బాలీవుడ్ స్టార్ హీరో ఫ్యామిలీకి సమీప బంధువు. అతని మరణవార్త తెలియగానే అక్షయ్ కుమార్ ఫ్యామిలీ హుటాహుటీన అక్క‌డికి చేరుకుంది. సచిన్ డెడ్ బాడీ చూసి ఒకింత భావోద్వేగానికి లోనైయ్యారు. సచిన్ మృతి పట్ల అక్షయ్ దిగ్బ్రఅంతి వ్యక్తం చేశారు. ప‌లువురు బాలీవుడ్ ప్ర‌ముఖులు కూడా సచిన్ మృతిపై స్పందిస్తూ తమ తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సచిన్ మృతి చెందారనే విషయాన్ని మొదట అత‌ని స్నేహితుడు రాక్‌శ్ పాల్ ధ్రువీకరించాడు. శుక్ర‌వారం ఉద‌యం సచిన్ తలుపు తీయ‌క‌పోవ‌డంతో.. అనుమానం వచ్చిన కుటుంబ స‌భ్యులు త‌లుపు పగలగొట్టగా అప్ప‌టికే ఆయన కుప్ప‌కూలిపోయి ఉన్నారని, వెంట‌నే ఆసుపత్రికి త‌ర‌లించ‌గా గుండెపోటుతో మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు తెలిపారని పేర్కొన్నాడు. ఆయ‌న మ‌ర‌ణం హృదయ విదార‌కమ‌ని, త‌మ‌కు ఎంతో లోటును మిగిల్చింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2AzklIy
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...