Sunday, 17 May 2020

నిఖిల్ పెళ్లి వీడియో వైరల్.. యమ జోష్‌లో కొత్త జంట! అదిరిందిందయ్యా హీరో..

లాక్‌డౌన్ సమయంలోనే యంగ్ హీరో ప్రేమకు ప్రమోషన్ దక్కింది. ప్రేయసి వర్మ మెడలో మూడుముళ్ళేసి ఏడడుగులు నడిచారు నిఖిల్. మే 14వ తేదీన తన బంధు మిత్రుల సమక్షంలో పురోహితులు నిర్ణయించిన ముహూర్తం ఉదయం 06 గంటల 31 నిమిషాలకు ఓ ఇంటివాడయ్యాడు హీరో నిఖిల్. లాక్‌డౌన్ అమలులో ఉన్న కారణంగా అతికొద్ది మంది సన్నిహితుల మధ్య ఈ వివాహం జరిగింది. హైదరాబాద్ శివారు ప్రాంతం శామీర్ పేటలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్‌ నిఖిల్ పెళ్ళికి వేదికైంది. భీమవరానికి చెందిన డాక్టర్ పల్లవి వర్మతో ఫిబ్రవరి 1న గోవాలో నిఖిల్ నిశ్చితార్థం జరిగింది. ముందుగా పెళ్లి కోసమై ఏప్రిల్ 16వ తేదీని ఫిక్స్ చేసుకున్నారు. అయితే, పెళ్లి తేదీకి సుమారు నెల రోజుల ముందు లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో రెండు కుటుంబాలు చర్చించుకుని మే 14వ తేదీన ఆ శుభకార్యాన్ని ఫినిష్ చేసేశాయి. Also Read: తాజాగా ఈ పెళ్లికి సంబంధించిన వీడియోను నిఖిల్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోకు ‘ఏమాయ చేసావే’ లోని మనసా మళ్లీ మళ్లీ చూసా అనే పాటను బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్‌గా పెట్టి అభిమానుల ముందుంచారు. బంధు వర్గం తక్కువగానే ఉన్నప్పటికీ డెకరేషన్, పెళ్లి మండపం, ఇతర కార్యక్రమాలు చాలా హుందాగా జరిపారని ఈ వీడియో చూస్తుంటే తెలుస్తోంది. కొత్త జంట నిఖిల్- పల్లవి యమ జోష్‌లో కనిపిస్తున్నారు. ఇది చూసి.. ''అదిరిందయ్యా హీరో, సూపర్, సూపర్ జోడీ, ఆహా వెరీ క్యూట్'' అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/364cRsL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...