శరత్ కుమార్ కూతురు హీరోయిన్ నిత్యం ఏదో ఒక రూపంలో వార్తల్లో దర్శనమిస్తూనే ఉంటుంది. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే ఆమె లైఫ్‌లో ప్రేమ వ్యవహారాలు, డేటింగ్ సంగతులకూ చోటుంది. గతంలో హీరో విశాల్‌తో వరలక్ష్మి ప్రేమాయణం సాగిస్తోందని, వారిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉన్నారనే వార్తలు విన్నాం. కానీ ఆ తర్వాత తమ మధ్య ఎలాంటి అఫైర్ లేదని వరలక్ష్మీ క్లారిటీ ఇవ్వడంతో ఆ వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది. ఈ క్రమంలో తాజాగా ఆమె ప్రేమ, పెళ్లికి సంబంధించిన మరికొన్ని వార్తలు కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లికి అంతా సిద్దం చేస్తున్నారని, లాక్‌డౌన్ ఫినిష్ కాగానే ఆమె ఓ ఇంటిది కాబోతుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా ఓ ఫేమస్ క్రికెటర్‌తో వరలక్ష్మి డేటింగ్ చేస్తోందని, ఆయనతోనే పెళ్లికి రెడీ అయిందని కోలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఆ క్రికెటర్ ధోనికి, కోహ్లీకి అత్యంత సన్నిహితుడని తెలుస్తుండటం జనాల్లో ఆసక్తికర అంశంగా మారింది. Also Read: వీళ్లిద్దరి ప్రేమాయణానికి ఇరు కుటుంబాల పెద్దలు కూడా అంగీకరించి శుభం కార్డు వేయాలని చూస్తున్నట్లు లేటెస్ట్ టాక్. ప్రస్తుతం పెళ్లి ఏర్పాట్లకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ లాక్‌డౌన్ ఫినిష్ కాగానే వరలక్ష్మి మెడలో మూడుముళ్లు పడనున్నాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇలాంటి వార్తలపై వరలక్ష్మి నుంచి ఎలాంటి స్పందన లేకపోగా.. ఆమె సన్నిహితులు మాత్రం ఖండిస్తున్నారు. చూడాలి మరి దీనిపై క్లారిటీ ఎప్పుడొస్తుందనేది. ఇకపోతే నటిగా కంటే వివాదాలతోనే ఫుల్ పాపులర్ అయిన వరలక్ష్మి శరత్ కుమార్.. ఇటీవలే కాస్టింగ్ కౌచ్ పై మరోసారి స్పందించి షాకింగ్ కామెంట్స్ చేసింది. తన తండ్రి హీరో అని తెలిసి కూడా తనను కూడా కొందరు సినీ ప్రముఖులు లైంగికంగా వేధించారని ఆమె పేర్కొంది. ప్రస్తుతం రవితేజ హీరోగా రూపొందుతున్న ‘క్రాక్’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది వరలక్ష్మి శరత్ కుమార్.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZhaIbD
v
No comments:
Post a Comment