Monday, 11 May 2020

దిల్ రాజు రెండో పెళ్లిపై కూతురు హన్షిత ప్రకటన

ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు రెండో పల్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం రాత్రి నిజామాబాద్ ఫామ్ హౌస్‌ ఆయన మరో వివాహం చేసుకున్నారు. కొద్దిమంది స్నేహితుల మధ్య వీరి పెళ్లి నిరాడంబరంగా జరిగింది. అయితే ఈ సందర్భంగా దిల్ రాజు కుమార్తె హన్షిత ఓ ప్రకటన విడుదల చేశారు. కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సందర్భంగా తన తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు. ‘డియర్ డాడ్.. నువ్వు నాకు అన్ని విషయాల్లో అండగా నిలిచావు. అన్నీ సమయాల్లోనే నువ్వే నా బలం. మీ వలన అందరం సంతోషంగా ఉన్నాం. మన కుటుంబ సంతోషం కోసం మీరు ఎన్నో చేశారు. కొత్త జీవితం ప్రారంభించబోతున్న మీకు శుభాకాంక్షలు. మీరిద్దరు సంతోషంగా ఉండాలని, ప్రతి రోజు అద్భుతంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఐ లవ్ యూ లాట్, యువర్స్ హన్షు అంటూ హన్షిత తన ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం నేను కొత్త జీవితాన్ని ఆరంభించడానికి ఇదే మంచి తరుణంగా భావిస్తున్నా అంటూ దిల్‌రాజు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. మూడేళ్ల క్రితం ఆయన భార్య అనిత గుండెపోటుతో మరణించారు. వీరిద్దరికి ఓ కూతురు కూడా ఉంది. భార్య మరణం తర్వాత ఒంటరిగా ఉంటున్న దిల్ రాజు రీసెంట్‌గా రెండో వివాహం చేసుకున్నారు. తేజస్విని ఆనే యువతిని ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆమె గతంలో ఎయిర్ హోస్టస్‌గా పనిచేశారు. ప్రస్తుతం దిల్‌రాజు 'వీ' 'వకీల్‌సాబ్‌' చిత్రాల్ని నిర్మిస్తున్నారు. 'వీ' సినిమా విడుదల కరోనా ప్రభావంతో వాయిదా పడింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2AiJ5Vl
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...