Wednesday, 13 May 2020

నిహారిక పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నాగబాబు

డాటర్ పెళ్లిపై రోజుకో వార్త షికారు చేస్తోంది. ఆ మ‌ధ్య సాయి ధ‌ర‌మ్ తేజ్, చేసుకుంటున్నారనే వార్త‌లు వ‌చ్చాయి. కానీ అవి అబ‌ద్ధ‌మ‌ని తేలిపోయింది. ఆ తర్వాత ప్రభాస్‌తో నిహారిక పెళ్లంటూ మరో వార్త హల్ చల్ చేసింది. దీనిపై నిహారిక క్లారిటీ ఇచ్చేసింది. తాను ప్రభాస్‌ను పెళ్లి చేసుకోవడం లేదని తేల్చేసింది. ఇప్పుడు తాజాగా నిహారిక పెళ్లి వార్తలపై స్పందించారు. ఆమె పెళ్లి ఎప్పుడు అన్న విషయంపై క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ నిహారికకు సంబంధాలు చూస్తున్నామున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలోనే ఆమె పెల్లి జరిపించే అవకాశాలు ఉన్నాయన్నారు.అంతేకాకుండా ఆ వెంటనే వరుణ్ తేజ్ కి కూడా మంచి సంబంధం చూసి పెళ్లి చేసే ఆలోచన ఉందన్నారు. వచ్చే ఏడాది చివరిలోగానీ .. 2022 ప్రారంభంలో కాని వరుణ్ పెళ్లి జరిపించే ఆలోచన ఉందన్నారు నాగబాబు. ఆ దిశగానే ప్రయత్నాలు చేయాలనుకుంటున్నామన్నారు. పిల్లల పెళ్లిళ్లు అనే బాధ్యత ప్రస్తుతం తనపై ఉందన్నారు మెగా బ్రదర్. ఆ బాధ్యత నుంచి బయటపడితే తాను కాస్త ఫ్రీ అయిపోతానన్నారు. వరుణ్ తేజ్ ను ఐపీఎస్ గా, నిహారికను డాక్టర్‌గా చూడాలనే కోరిక తనకు ఉండేదన్నారు. కానీ నిహారిక సినిమాల్లోకి వస్తానంటే కాదనలేకపోయానన్నారు. అలాగే వెబ్ సీరియస్ విషయంలో కూడా ఓకే అన్నానని తెలిపారు. తన ఇష్టాన్ని పిల్లలపై రుద్దడం ఇష్టం లేకే వాళ్లకి ఇష్టమైన మార్గంలో వెళ్లేందుకు తన వంతుగా సపోర్ట్ ఇచ్చారని నాగబాబు తెలిపారు. ఇప్పుడు టాలీవుడ్‌లో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. యంగ్ హీరోలంతా ఒక ఇంటివారు అయిపోతున్నారు. తమకు ఇష్టమైన వారితో పీఠముడి వేసుకునేందుకు రెడీఅయిపోతున్నారు. దీంతో సెలబ్రిటీల పెళ్లిళ్లలకు సంబంధించిన అనేక రకాల వార్తలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి. అందుకే వాటిపై కాస్త దృష్టి పెట్టిన నాగబాబు.. నిహారిక పెళ్లిపై రోజురోజుకు పుట్టుకొస్తున్న వార్తలపై చెక్ పెట్టేలా ప్రకటన చేసేశారు నాగబాబు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3csrPv5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...