Monday, 11 May 2020

మరో సినిమాను లైన్ లోకి తెచ్చిన విజయ్ దేవరకొండ.. ఆ డైరెక్టర్‌తో కమిట్!

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సూపర్ ఫామ్‌లో ఉన్నారు. జయాపజయాల మాటెలా ఉన్నా వరుస సినిమాలతో అభిమానులకు కిక్కిస్తున్నారు. అనతికాలంలోనే స్టార్ హీరో రేంజ్ ఇమేజ్ సొంతం చేసుకొని టాలీవుడ్ సెన్సేషన్ స్టార్‌గా స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకున్న ఆయన ఇటీవలే 'వరల్డ్ ఫేమస్ లవర్' రూపంలో అలరించారు. ఇక ఇప్పుడు 'ఫైటర్'గా వెండితెరను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకొని లాక్‌డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా వేసుకుంది. ఈ మూవీలో నటిస్తూనే మరిన్ని డిఫరెంట్ కథలను వింటున్నారట విజయ్ దేవరకొండ. ఈ క్రమంలో ఇప్పటికే డైరెక్టర్ శివ నిర్వాణ వినిపించిన కథను ఫైనల్ చేశారని తెలిసింది. ఇదిలా ఉండగానే మరో డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణతో సినిమాను లైన్ లోకి తెచ్చారని సమాచారం. వైవిధ్యభరితమైన కథలను రూపొందించడంలో దిట్ట అయిన ఇంద్రగంటి.. గతంలో నానితో ''అష్టాచమ్మా, జెంటిల్ మెన్'' లాంటి సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం అదే నానితో V సినిమాను పూర్తి చేసి రిలీజ్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండతో ఓ ప్రయోగాత్మక సినిమా చేయాలని ఇంద్రగంటి ఫిక్స్ అయినట్లు ఇన్‌సైడ్ టాక్. ఇటీవల విజయ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన చేసిన ట్వీట్, దానికి 'మనిద్దరం కలిసి అద్భుతం చేయబోతున్నాం' అంటూ విజయ్ దేవరకొండ ఇచ్చిన రెస్పాన్స్ చూస్తే ఈ మూవీ కన్ఫర్మ్ అయిందనే అర్థం చెసుకోవచ్చు. వారిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణ విజయ్ అభిమానుల్లో నూతనోత్సాహం నింపింది. 2021 ఆరంభంలో ఈ మూవీ పట్టాలెక్కే ఛాన్స్ ఉందని ఫిలింనగర్ టాక్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3cn60wU
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...