Wednesday, 13 May 2020

ఆ ముగ్గురికీ లభించాల్సిన గుర్తింపు లభించడం లేదు.. మంచు విష్ణు ఎమోషనల్ కామెంట్స్

సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ ఉండే సెలబ్రిటీల్లో ఒకరు. తాను చెప్పాలనుకున్న విషయాన్ని ఏ మాత్రం సందేహించకుండా బయటపెట్టేయడం ఆయనకు అలవాటు. ముఖ్యంగా సామజిక అంశాలపై తనదైన కోణంలో స్పందిస్తూ అట్రాక్ట్ చేస్తుంటారు మంచు విష్ణు. ఈ క్రమంలోనే జన్మనిచ్చిన తల్లి, వీర జవానులు, రైతుల గొప్పతనం గురించి తెలుపుతూ తాజాగా ఆయన పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మంచు విష్ణు మాట్లాడుతూ.. ''ఈ రోజు నా మనసులో ఉన్న మాట మీతో చెప్పాలని మీ ముందుకొచ్చాను. ప్రపంచంలో నిత్యం మనము శిరస్సు వంచి నమస్కరించాల్సిన వాళ్ళు ముగ్గురు. బిడ్డకు జన్మనిచ్చిన తల్లి, మన ఆకలి తీర్చే రైతన్న, తన కుటుంబానికి దూరమై మన భద్రత కోసం కాపలా కాసే వీర జవాన్. ఈ ముగ్గురికీ లభించవలసిన గుర్తింపు లభించడం లేదని నా భావన. నా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆదర్శనీయమైన కన్న తల్లుల్ని, కష్ట జీవులైన రైతులను కలిసే అదృష్టం నాకు కలిగింది. కానీ వీర జవానులను కలిసే అదృష్టం కలగలేదు. అందుకే ఇప్పుడు భారత్ ఆర్మీ ఫోర్స్ గురించి తెలుసుకునే కొత్త ప్రయాణం మొదలుపెడుతున్నా. ప్రపంచంలో ఎంతో సమర్ధవంతమైన భారత్ ఆర్మీ ఫోర్స్‌లో అడుగుపెట్టి తమదైన ముద్ర వేసిన తెలుగు వీర జవానుల గురించి తెలుసుకోబోతున్నాను. మీలో ఎవరి దగ్గరైనా మన తెలుగు వీర జవానుల త్యాగాలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు, పేర్లు ఉంటే నా ట్విటర్ ఖాతాకు పంపించాల్సిందిగా కోరుతున్నా. ప్రపంచంతో వాళ్ళ వీర కథలను పంచుకుందాం. జై జవాన్.. జై కిసాన్.. జై హింద్'' అన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ మంచువిష్ణు మనసుని మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Wx9irY
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...