Friday, 15 May 2020

దానికి రెడీ అయిన హాట్ హీరోయిన్.. ప్రియుడితోనే బోల్డ్ బ్యూటీ! ఇక వీడియో కాల్‌తో పనేంటి?

బాలీవుడ్ హాట్ బ్యూటీ పెళ్ళికి రెడీగా ఉందట. నిత్యం సోషల్ మీడియాలో సెగలు పుట్టించే ఈ హాట్ భామ ఇక జీవిత భాగస్వామితో ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిందట. గత కొన్నేళ్లుగా మ్యాటర్ ఆన్‌లైన్ వేదికలపై హాట్ టాపిక్ అవుతూ వస్తోంది. మొదట క్రికెటర్ హార్దిక్ పాండ్యతో ఆమె డేటింగ్ చేస్తోందంటూ, వారిద్దరూ ఒక్కరోజు కూడా ఒకరిని విడిచి మరొకరు ఉండలేకపోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ అలాంటి వార్తలను ఖండిచి అసలు హర్దిక్ పాండ్యా ఎవరో కూడా తనకు తెలియదంటూ ఘాటుగా స్పందించింది ఈషా. ఈ క్రమంలోనే చాలాసార్లు తన పెళ్లి వార్తలపై ఫైర్ అవుతూ వచ్చిన ఈ హాట్ బ్యూటీ ఇటీవలే తన డేటింగ్ వ్యవహారాన్ని బయటపెట్టింది. తన ప్రియుడు స్పానిష్ పారిశ్రామిక వేత్త మాన్యుయెల్ కాంపోస్ గుల్లార్ అని తెలిపింది ఈషా. ఈ మేరకు స్పెయిన్‌లో తన ప్రియుడు కష్టాల్లో ఉన్నాడని పేర్కొన్న ఆమె రోజూ అతనితో వీడియో కాల్ ద్వారా కాంటాక్ట్ అవుతున్నానని తెలిపింది. ఆయన గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల తన ఆరోగ్యం కూడా సరిగా ఉండటం లేదని ఆమె చెప్పటం విశేషం. కాగా లేటెస్ట్ సమాచారం మేరకు త్వరలోనే ఆయనను పెళ్లి కూడా చేసుకొని కాపురం పెట్టేయాలని ఫిక్స్ అయిందట ఈషా. తన స్నేహితులతో ఈ విషయం పంచుకున్నట్లు బీ టౌన్‌లో టాక్ వినిపిస్తోంది. Also Read: 2007 సంవత్సరంలో మిస్ ఇండియా ఇంటర్నేషనల్‌గా ఎంపికైంది ఈషా గుప్తా. ఆ తర్వాత 2012 సంవత్సరంలో 'జన్నత్ 2' అనే సినిమా ద్వారా బాలీవుడ్ తెరపై కాలుమోపి.. రాజ్ 3D, రుస్తోం, బాద్ షాహో లాంటి సినిమాల్లో అందాల విందునిచ్చి హాట్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అటు సోషల్ మీడియా, ఇటు వెండితెర రెండింటినీ ఏలడంలో ఆమె మంచి బాలెన్స్ మెయిన్‌టైన్ చేస్తుంటుంది. తెలుగులో రామ్‌చ‌ర‌ణ్ ‘విన‌య‌విధేయ‌రామ‌’ చిత్రంలో ఓ చిన్న పాత్ర‌లో నటించింది ఈషా. చూడాలి మరి ప్రియుడితో ఈషా ఎప్పుడు ముహూర్తం ఖాయం చేస్తుందో!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3fWUKcz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...