Friday 29 May 2020

శ్రీదేవిపై కీలక వ్యాఖ్యలు చేసిన మాధురి దీక్షిత్

అతిలోక సుందరి శ్రీదేవి మనందర్నీ విడిచి వెళ్లిన విషయం తెలిసింది. అయితే ఆమె చనిపోయిన ఇన్నాళ్ల తర్వాత... బాలీవుడ్‌లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ మాధురి దీక్షిత్, శ్రీదేవిపై కీలక వ్యాఖ్యలు చేసింది. తనకు, శ్రీదేవికి మధ్య ఏనాడూ పోటీలేదని ఆమె పేర్కొంది. వీరిద్దరూ ఒకప్పుడు హీరోయిన్లుగా బాలీవుడ్‌ను షేక్ చేశారు. అనేక హిట్లు అందుకోవడంతోపాటు కోట్లాది అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలో అప్పట్లో శ్రీదేవి, మాధురీకి మధ్య పోటీ ఉందని చెప్పుకొనేవాళ్లు. తాజాగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాధురీని ఇదే ప్రశ్న అడిగారు. దీనిపై స్పందించిన ఆమె 'శ్రీదేవికి వృత్తిపట్ల అంకితభావం చాలా ఎక్కువ. ఆమె తన మొత్తం జీవితాన్ని నటనకే అంకితం చేశారు. ఆమె చేసిన సినిమాల్లో ఐదో భాగం కూడా నేను చేయలేదు. మా మధ్య ఎటువంటి పోటీ లేదు. మేం రేసు గుర్రాలం కాదు, కాబట్టి ఎవరు ముందు ఉన్నారనే విషయం గురించి ఆలోచించకండి' అని పేర్కొన్నారు. ఆ తర్వాత కరోనా వైరస్ లాక్‌డౌన్‌లో జీవితం గురించి మాట్లాడుతూ.. 'సమయం లేదని మనం ఎప్పుడూ అంటుంటాం. పనులతో తీరిక లేకుండా గడుపుతుంటాం. కానీ, ఇప్పుడు ఓ కారణం వల్ల కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడిపే అవకాశం వచ్చింది. నేను కథక్‌ సాధన చేస్తున్నా. వంట కూడా చేస్తూ.. నన్ను నేను బిజీగా ఉంచుకుంటున్నా' అని అన్నారు. మాధురీ 'కళంక్‌' సినిమాతో 2019లో బాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇచ్చి మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం ధర్మ ప్రొడక్షన్స్‌ తీస్తున్న నెట్‌ఫ్లిక్‌ సిరీస్‌లో నటిస్తున్నారు. 'డ్యాన్స్‌ దివానే' షోకు న్యాయనిర్ణేతగా పనిచేస్తున్నారు. మాధురీ తొలిసారి పాడిన పాటను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. ప్రస్తుతం మాధురి వయసు 53 ఏళ్లు. పూర్తి పూరు మాధురి శంకర్ దీక్షిత్. ఆమెది మరాఠికి చెందిన బ్రాహ్మణ కుటుంబం. 1984లో మాధురి దీక్షిత్ "అబోద్" సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యారు. 2003 లో ఆమె పేరు మీదగా "మై మాధురి దీక్షిత్ బన్నా చాహ్తీ హుం" అనే సినిమా విడుదల అయ్యింది. ఈ చిత్రంలో అంత్ర మాలి నటించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ZQjrlB
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...