Thursday 30 April 2020

రిషి కపూర్ అంత్యక్రియలు పూర్తి.. కడచూపు దక్కించుకోని కూతురు

బాలీవుడ్ దిగ్గజ నటుడు అంత్యక్రియలు పూర్తయ్యాయి. ముంబైలోని చందన్‌వాడి శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలులో ఉండటంతో హాస్పిటల్ నుంచి అంబులెన్స్‌లో శ్మశాన వాటికకు తీసకొచ్చి సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరిపారు. రణ్‌బీర్ కపూర్ తన తండ్రికి తలకొరివి పెట్టారు. రిషి కపూర్ అంత్యక్రియలో కొంత మంది కుటుంబ సభ్యులు, ఆయన కుటుంబానికి సన్నిహితులైన కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. నిజానికి సాధారణ పరిస్థితులు ఉండుంటే రిషి కపూర్ అంత్యక్రియలు ఆడంబరంగా జరిగి ఉండేవి. ముంబైలోని ఆయన అభిమానులు ర్యాలీలు చేసుండేవారు. కానీ, లాక్‌డౌన్ కారణంగా కేవలం 20 మంది సన్నిహితుల సమక్షంలో రిషి కపూర్ అంత్యక్రియలు జరిగాయి. కపూర్ ఫ్యామిలీ నుంచి కొంత మందిని, సినీ పరిశ్రమకు చెందిన కొంత మంది స్నేహితులను మాత్రమే అంత్యక్రియలకు అనుమతించారు. రిషి కపూర్ భార్య నీతూ కపూర్, సోదరి రిమా జైన్, మనోజ్ జైన్, అర్మాన్ జైన్, ఆదర్ జైన్, అనిషా జైన్, రాజీవ్ కపూర్, రణ్‌ధీర్ కపూర్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, అభిషేక్ బచ్చన్, అలియా భట్, డాక్టర్ తరంగ్, అయాన్ ముఖర్జీ, జైరామ్, రోహిత్ ధావన్, రాహుల్ రావైల్ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. Also Read: రిషి కపూర్ కుమార్తె రిధిమా కపూర్ సహ్ని అంత్యక్రియల్లో పాల్గొనలేకపోయారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆమె.. లాక్‌డౌన్ కారణంగా రాలేకపోయారు. రేపు ఆమె ముంబై చేరుకుంటారు. పోలీసులను ప్రత్యేక అనుమతి తీసుకున్న రిధిమా కారులో ఢిల్లీ నుంచి బయలుదేరారు. కాగా, రిషి కపూర్ ఈరోజు (ఏప్రిల్ 30న) ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. రెండేళ్లుగా లుకేమియాతో బాధపడుతోన్న రిషి కపూర్.. తీవ్ర అస్వస్థతో బుధవారం ఉదయం హాస్పిటల్‌లో చేరారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2VRbVED
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...