Tuesday 28 April 2020

ఇర్ఫాన్ ఖాన్‌కు అస్వస్థత.. ఐసీయూలో చికిత్స.. తల్లి మృతిచెందిన బాధలోనేనా?

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం అకస్మాత్తుగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్‌లో చేర్పించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్టు న్యూస్ ఛానెల్ ఆజ్ తక్ వెల్లడించింది. ఇర్ఫాన్ ఖాన్ న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ (క్యాన్సర్) బారిన పడిన సంగతి తెలిసిందే. దీనికి ఆయన లండన్‌లో చికిత్స తీసుకున్నారు. క్యాన్సర్ నుంచి కోలుకుని గత ఏడాది సెప్టెంబర్‌లో ముంబై చేరుకున్నారు. అప్పటి నుంచి ముంబైలో చికిత్స పొందుతున్నారు. అయితే, మంగళవారం అకస్మాత్తుగా ఆయన అస్వస్థతకు గురైనట్టు సమాచారం. ఇదిలా ఉంటే, మూడు రోజుల క్రితమే అంటే శనివారం (ఏప్రిల్ 25న) ఇర్ఫాన్ ఖాన్ తల్లి సయీద బేగం (95) కన్నుమూశారు. అయితే, రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన తల్లి అంత్యక్రియలకు ఇర్ఫాన్ వెళ్లలేకపోయారు. ప్రస్తుతం లాక్‌డౌన్ అమల్లో ఉండటంతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తల్లి అంత్యక్రియలను చూడాల్సి వచ్చింది. దీంతో ఇర్ఫాన్ చాలా బాధపడినట్టు సన్నిహితులు వెల్లడించారు. తల్లి మరణంతో ఆయన డిప్రెషన్‌లోకి వెళ్లారట. దీని వల్లే ఆయన ఆరోగ్యం క్షీణించి ఉండొచ్చని అంటున్నారు. అయితే, ఆయన కుటుంబ సభ్యులు నుంచి కానీ.. హాస్పిటల్ వర్గాల నుంచి ఎలాంటి సమాచారం లేదు. అసలు ఇర్ఫాన్ హాస్పిటల్‌లో చేరడం వెనుక అసలు కారణం కూడా స్పష్టంగా తెలియడంలేదు. Also Read: ఇర్ఫాన్ ఖాన్ భార్య, ఆయన ఇద్దరు కుమారులు ప్రస్తుతం హాస్పిటల్‌లోనే ఉన్నారని తెలిసింది. అయితే, ఈ లాక్‌డౌన్ కారణంగా ఇర్ఫాన్ ఖాన్ రెగ్యులర్ ట్రీట్‌మెంట్‌కు ఇబ్బంది కలిగిందని, దీని వల్ల కూడా ఆయన అస్వస్థతకు గురై ఉండొచ్చని ఆయన సన్నిహితులు ‘నవభారత్ టైమ్స్‌’కు తెలిపారు. కాగా, లండన్‌ నుంచి తిరిగి వచ్చిన తరవాత ‘అంగేజి మీడియం’ చిత్రం ద్వారా ఇర్ఫాన్ ఖాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరీనా కపూర్ ఖాన్, రాధికా మదన్, దీపికా దోబ్రియాల్ నటించిన ఈ చిత్రం మార్చి 13న విడుదలైంది. అయితే, లాక్‌డౌన్ కారణంగా ప్రదర్శనలు ఆగిపోవడంతో సినిమాకు నష్టాలు వచ్చాయి. దీంతో నిర్మాతలు డిజిటల్ ప్లాట్‌ఫాంలో విడుదల చేసేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/35bikgZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...