Wednesday 29 April 2020

లాక్‌డౌన్ ప్రభావం.. ఇర్ఫాన్ ఖాన్ అంత్యక్రియలు పూర్తి

బాలీవుడ్ విలక్షణ నటుడు కన్నుమూశారు. చాలా కాలంగా క్యానర్స్‌తో పోరాడిన ఇర్ఫాన్ ఏప్రిల్ 29న ముంబైలోని కోకిలా బెన్ హాస్పిటల్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు ప్రస్తుతం 53 సంవత్సరాలు. అయితే, ఇర్ఫాన్ ఖాన్ మృతిచెందిన కాసేపటికే కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ముంబైలోని వెర్సోవా ముస్లిం శ్మశాన వాటికలో ఇర్ఫాన్ పార్థివదేహాన్ని ఖననం చేశారు. ఈ మేరకు ఇర్ఫాన్ కుటుంబం ప్రకటనను విడుదల చేసింది. Also Read: ‘‘ఇర్ఫాన్ కన్నుమూసినట్టు ప్రకటించిన కొద్దిసేపటికే మధ్యాహ్నం 3 గంటలకు ముంబైలోని వెర్సోవా కర్బస్తాన్‌లో ఖననం చేశాం. అంత్యక్రియల్లో ఆయన కుటుంబ సభ్యులు, సమీప బంధువులు, స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. అందరూ ఇర్ఫాన్‌కు అంతిమ నివాళులు అర్పించి, ఆయన మృతి పట్ల తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని మేం ప్రార్థిస్తున్నాం’’ అని ప్రకటనలో ఇర్ఫాన్ కుటుంబం పేర్కొంది. కాగా, ఇర్ఫాన్ అంత్యక్రియల్లో నటులు విశాల్ భరద్వాజ్, కపిల్ శర్మ, మికా సింగ్ పాల్గొన్నారు. పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలు నిర్వహించారు. ఇర్ఫాన్ ఖాన్ 2018లో న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ (క్యాన్సర్) బారిన పడ్డారు. దీనికి ఆయన లండన్‌లో చికిత్స తీసుకున్నారు. చికిత్స నిమిత్తం చాలా కాలం అక్కడే ఉన్నారు. క్యాన్సర్ నుంచి కోలుకుని 2019 సెప్టెంబర్‌లో ఇండియాకు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి ముంబైలో నిరంతర చికిత్స పొందుతున్నారు. అయితే, లాక్‌డౌన్ కారణంగా ఆయన నిరంతర చికిత్సకు కాస్త ఆటంకం కలిగినట్టు తెలుస్తోంది. మంగళవారం అకస్మాత్తుగా ఆయన తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్‌లో చేర్పించారు. చికిత్స పొందుతూ ఇర్ఫాన్ కన్నుమూశారు. ఇర్ఫాన్ తల్లి సయీద బేగం నాలుగు రోజుల క్రితం అంటే ఈనెల 25న మరణించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KLtmjo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...