Tuesday, 17 March 2020

ట్రెండింగ్ స్టార్‌కి మూడింది.. పోలీసులు స్టేషన్‌లో లావణ్య త్రిపాఠి కంప్లైంట్, ఇంటర్వ్యూలు చేసినోళ్లు రావాల్సిందే

శ్రీరామోజు సునిశిత్.. వార్నీ ఎవరీ ట్రెండింగ్ స్టార్.. యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనోడు పిచ్చి కామెంట్స్‌కి యూట్యూబ్ సైతం చెమటలు పట్టేసే పరిస్థితి. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. మనోడు చెప్పడం స్టార్ట్ చేస్తే టాలీవుడ్‌లో ఏ ఒక్కర్నీ వదల్లేదు. మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల దగ్గర నుండి తమన్నా, అనుష్క, , సమంత ఇలా హీరోయిన్స్ అందర్నీ చుట్టేశాడు. బాహుబలి సినిమా దగ్గర నుండి మహేష్ బాబు నేనొక్కడే వరకూ నేనే హీరో అంటూ రాజమౌళి, సుకుమార్ లాంటి స్టార్ దర్శకులకు నేను తప్ప వేరే దిక్కులేదంటూ నోటికొచ్చినట్టు మాట్లాడేశాడు. అంతా బాగానే ఉంది కాని హీరోయిన్ లావణ్య త్రిపాఠితో తనకు పెళ్లైందని.. మా ఇంట్లో ఒప్పుకోకపోవడంతో ఆమెను గుళ్లో పెళ్లి చేసుకుని కాపురం చేశానని.. ఐదునెలల్లో మూడు సార్లు అబార్షన్ చేయించా అంటూ ఓ యూట్యూబ్ ఛానల్ పిచ్చిపిచ్చి కూతలు కూశాడు. అంతేకాదు యాంకర్ ప్రదీప్‌తో ఆమెకు ఎఫైర్ ఉందంటూ కావాలంటే ఆమెకు ఫోన్ చేసి అడగండి అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడేసి యూట్యూబ్‌లో ట్రెండింగ్ అయ్యాడు. హీరోయిన్ తమన్నాను సైతం పెళ్లి చేసుకున్నా అంటూ పిచ్చి కామెంట్స్ చేశాడు. అయితే ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హీరోయిన్ లావణ్య త్రిపాఠి మనోడి డొక్క చింపి డోలు కట్టించేందుకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు మెయిల్ ద్వారా కంప్లైంట్ ఇచ్చింది. శ్రీరామోజు సునిశిత్ అనే వ్యక్తి తనతో పెళ్లైందని తప్పుడు ప్రచారం చేస్తున్నాడని వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది లావణ్య త్రిపాఠి. ఈ కేసుని తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సునిశిత్ స్టేషన్‌కు తీసుకురావమే కాకుండా అతనితో ఇంటర్వ్యూలు చేసిన వివిధ యూట్యూబ్ ఛానల్స్ యాంకర్స్‌ని, ఆ ఛానల్స్ నిర్వాహకుల్ని కమీషనర్ ఆఫీస్‌కి తీసుకువస్తున్నారు. ఈ ఇష్యూపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ మాట్లాడుతూ.. యూట్యూబ్ ఛానల్స్‌లో నోటికొచ్చినట్టు మాట్లాడుతూ.. మహిళల్ని కించపరిస్తే జైల్లో వేయడం ఖాయం అని అన్నారు. శ్రీరామోజు సునిశిత్ అనే వ్యక్తి హీరోయిన్‌ లావణ్య త్రిపాఠితో పెళ్లైందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడనే ఫిర్యాదు అందిందని కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం అన్నారు. Read Also:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3d5SRci
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...