Friday, 13 March 2020

అల్లు అర్జున్ డైరెక్టర్‌తో రవితేజ సినిమా ఖరారు

మాస్ మహారాజా రవితేజ సినిమా విడుదలవుతుంది అంటే ఒకప్పుడు భారీ అంచనాలుండేవి. కానీ, ఇప్పుడు ఆ అంచనాలు బాగా తగ్గిపోయాయి. దీనికి కారణం వరుస డిజాస్టర్లు. ‘రాజా ది గ్రేట్’ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్టు కనిపించిన ఈ టాలెంటెడ్ మాస్ హీరో.. ఆ తరవాత తన విజయ పరంపరను కొనసాగించలేకపోయారు. వరుసగా ‘టచ్ చేసి చూడు’, ‘నేల టిక్కెట్’, ‘అమర్ అక్బర్ ఆంటొని’, ‘డిస్కో రాజా’ డిజాస్టర్లు అయ్యాయి. నిజానికి ఈ ఏడాది వచ్చిన ‘డిస్కో రాజా’పై అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, ఈ చిత్రం ఆ అంచనాలను అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ప్రస్తుతం రవితేజ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ‘బలుపు’ వంటి హిట్ సినిమా రావడంతో.. ఇప్పుడు ‘క్రాక్’పై అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవల విడుదలైన టీజర్ కూడా బాగుండటంతో మళ్లీ ప్రేక్షకుల దృష్టి మాస్ మహారాజాపై పడింది. ఇదిలా ఉంటే, రవితేజ తాజాగా మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందే ఈ సినిమాను వ‌క్కంతం వంశీ దర్శకత్వం వహించనున్నారు. Also Read: టాలీవుడ్‌లో కథా రచయితగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న వ‌క్కంతం వంశీ.. ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ను చాలా రఫ్ చూపించి దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటుకున్నారు. అయితే, ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే, వంశీ ఇప్పుడు ర‌వితేజ కోసం ఒక అద్భుత‌మైన స్క్రిప్ట్ సిద్ధం చేశారట. గ‌తంలో ర‌వితేజ న‌టించిన కొన్ని సినిమాల‌కు వంశీ రైట‌ర్‌గా ప‌నిచేశారు. వంశీ వినిపించిన స్క్రిప్ట్ బాగా న‌చ్చడంతో.. ఆయనతో కలిసి ప‌నిచేయ‌డానికి ర‌వితేజ అంగీకరించారు. ఈ చిత్రాన్ని ఎవ‌రు నిర్మిస్తారు, ఇందులో హీరోయిన్ ఎవ‌రు అనే వివ‌రాలు త్వర‌లోనే వెల్లడించనున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/3aWHMYX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...