Monday, 9 March 2020

రానా ‘విరాట‌ప‌ర్వం’ అప్డేట్.. వీళ్లు రంగంలోకి దిగితే దిమ్మతిరుగుద్ది

రానా, సాయిప‌ల్ల‌వి జంట‌గా వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న రొమాంటిక్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ 'విరాట‌ప‌ర్వం'‌. ఈ సినిమా షూటింగ్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. చివ‌రి షెడ్యూల్ మాత్రమే పెండింగ్‌లో ఉండగా.. ఈ చిత్ర విశేషాలను తెలియజేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రానికి కొంత‌మంది హాలీవుడ్‌, బాలీవుడ్ టెక్నీషియ‌న్లు, ఆర్టిస్టులు ప‌నిచేస్తుండ‌టం విశేషం. ఈ సినిమాలోని ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌ల్లో యాక్ష‌న్ స‌న్నివేశాలు ఒక‌టి. బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ 'ఉరీ: ద స‌ర్జిక‌ల్ స్ట్రైక్‌'కు ప‌నిచేసిన హాలీవుడ్ స్టంట్ డైరెక్ట‌ర్ స్టీఫెన్ రిచెర్ ఈ సినిమాలోని యాక్ష‌న్ సీక్వెన్స్‌ల‌కు రూప‌క‌ల్ప‌న చేశారు. యాక్ష‌న్‌ స‌హా అన్ని ర‌కాల స‌న్నివేశాల‌కు రానా, ఇత‌ర తారాగ‌ణం పూర్తిస్థాయిలో శ్ర‌మిస్తుండ‌గా, ఉన్న‌త‌స్థాయి నాణ్య‌తా ప్ర‌మాణాల‌తో నిర్మాత‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'నీదీ నాదీ ఒకే క‌థ' ఫేమ్ వేణు ఊడుగుల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి ఒక కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తారు. డి. సురేష్‌బాబు, సుధాక‌ర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో బాలీవుడ్ ఫేమ‌స్ న‌టి నందితా దాస్‌, ఈశ్వ‌రీరావు, జ‌రీనా వ‌హాబ్ ప్ర‌ధాన పాత్ర‌లు చేస్తున్నారు. హాలీవుడ్‌కు చెందిన డానీ సాంచెజ్‌-లోపెజ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఈ వేస‌విలో 'విరాట‌ప‌ర్వం'ను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2xpTFIH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...