Tuesday, 17 March 2020

కరోనా ఎఫెక్ట్: ఐసోలేషన్‌లో దిగ్గజ నటుడు

కరోనా వైరస్ శరవేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది. జలుబు, దగ్గు, జ్వరం లాంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లాలని చెబుతోంది. వైరస్ సోకకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజా ప్రయోజన ప్రకటనలను జారీ చేస్తోంది. వయసు మళ్లినవారు, ఆస్తమా, నుమోనియా, డయాబిటిస్ వంటి వ్యాధులతో బాధపడుతున్నవారు ఇళ్లలో నుంచి బయటికి రావొద్దని డాక్టర్లు సైతం సూచిస్తున్నారు. దీంతో చాలా మంది వృద్ధులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. బాలీవుడ్‌ దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ సైతం తనకు తానుగా ఒంటరిగా దిగ్బంధించుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో తనకు అది సోకకుండా ముందు జాగ్రత్తగా తాను పూర్తిగా ఐసోలేషన్ గదిలో విశ్రాంతి తీసుకుంటున్నట్లు దిలీప్ కుమార్ ప్రకటించారు. ‘‘నాకు ఎలాంటి ఇన్ఫెక్షన్ సోకకూడదని సైరా (దిలీప్ కుమార్ భార్య) అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది’’ అని ట్వీట్‌లో దిలీప్ కుమార్ పేర్కొన్నారు. దేశ ప్రజలకు కూడా ఆయన జాగ్రత్తలు చెప్పారు. ‘‘అందరూ ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైనంత వరకు ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నించాలని కోరుతున్నా. కరోనా వైరస్ అన్ని హద్దులను, సరిహద్దులను దాటుకొని వచ్చేస్తోంది. ఆరోగ్య శాఖలు జారీ చేసిన అన్ని సూచనలను పాటించండి. మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి. ఇతరులను బహిరంగంగా కలవడం తగ్గించండి’’ అని దిలీప్ కుమార్ సూచించారు. దిలీప్ కుమార్ వయసు ప్రస్తుతం 97 సంవత్సరాలు. గత కొన్నాళ్లుగా ఆయనకి ఆరోగ్యం బాగోవడం లేదు. ఇప్పటికే రెండు మూడుసార్లు ఫ్యాన్స్‌ని ఆందోళనకు గురిచేశారు. చాలా రోజులుగా ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఇప్పుడు కరోనా వైరస్ భయంతో దిలీప్ కుమార్ భార్య, ప్రముఖ నటి సైరా భాను ఆయన్ని ఐసోలేషన్ గదిలో పెట్టారు. కాగా, ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా అనేకమంది బాలీవుడ్ హీరోలు తమ విదేశీ పర్యటనల్ని రద్దు చేసుకున్నారు. పలువురు షూటింగ్స్ కూడా నిలిపివేసుకున్నారు. టాలీవుడ్‌లో కూడా ఇదే పరిస్థితి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2U81QB2
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...