Thursday, 12 March 2020

‘అమృతం ద్వితీయం’ ట్రైలర్: ఇది నిజంగా ‘అద్వితీయం’ అంటోన్న రాజమౌళి

తెలుగు బుల్లితెర చరిత్రలో ‘అమృతం’ ధారావాహికకు ఒక అధ్యాయం ఉంది. తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఈ కామెడీ సిరీస్ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ముఖ్యంగా ఈ ధారావాహికలో అంజి, అమృతరావు, సర్వం పాత్రలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయాయి. సుమారు 19 ఏళ్ల తరవాత ఈ పాత్రలు మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాయి. ‘అమృతం’కు సీక్వెల్‌గా ‘అమృతం ద్వితీయం’ (అద్వితీయం) సిట్యువేషన్ కామెడీ (సిట్‌కామ్) సిరీస్ వస్తోంది. ‘అమృతం’లో ఆంజనేయులు పాత్ర పోషించిన గుండు హనుమంతరావు కన్నుమూయడంతో ఆయన పాత్రలో ఇప్పుడు ఎల్బీ శ్రీరాం నటిస్తున్నారు. హర్షవర్ధన్, శివన్నారాయణ, వాసు ఇంటూరి, రాగిణి తమ పూర్వ పాత్రలే పోషించగా.. ఎల్బీ శ్రీరామ్ అంజి పాత్రలో, సత్యక్రిష్ణ అమృతం భార్య సంజీవిని పాత్రలో కనబడనున్నారు. కాశీ విశ్వనాథ్, రాఘవ కీలకమైన పాత్రలు పోషించారు. ఈ కామెడీ సిరీస్ ఉగాది కానుకగా మార్చి 25 నుంచి మొదలుకాబోతోంది. జీ5లో ఈ సిరీస్ ప్రసారమవుతుంది. అయితే, అమృతవిలాస్‌ను మళ్లీ తెరవడానికి ముందు అది ఎలా ఉండబోతోందో ఒక చిన్న ట్రైలర్ ద్వారా శాంపిల్ చూపించారు. ఈ ట్రైలన్‌ను ప్రముఖ దర్శకుడు, దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ‘అమృతం ద్వితీయం’ నిజంగా అద్వితీయం అన్నారు. దాని గొప్పతనాన్ని తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ‘‘19 ఏళ్ల క్రితం, కన్నీళ్లు తెప్పించే సీరియల్స్ శాసిస్తున్నప్పుడు.. ధైర్యం, దృఢవిశ్వాసం కలిగిన ఒక వ్యక్తి ఒక కామెడీ షోతో వచ్చి ఆ ప్రమాణాలన్నింటినీ పటాపంచలు చేశారు. నాలుగు సార్లు ప్రసారమైన ఏకైక సీరియల్!! 270 మిలియన్ వ్యూస్.. గడిచిన కొద్ది నెలలుగా నెలకు 6 మిలియన్ వ్యూస్ సాధించిన సీరియల్. ఎప్పటికీ విజయం సాధించలేని హీరోలు అంజి, అమృతరావుల సక్సెస్ స్టోరీ ఇది. నిజంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘అమృతం’ ఒక స్థానాన్ని ఏర్పరుచుకుంది. దీనికి సెకండ్ ఇన్‌స్టాల్‌మెంట్ కావాలని అభిమానులు కోరుకున్నారు. మొత్తానికి ఈ ఉగాది అమృతం ద్వితీయంను తీసుకొస్తోంది. ఇది నిజంగా అద్వితీయం’’ అని రాజమౌళి తన పోస్ట్‌లో పేర్కొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TIvgXw
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...