Monday, 9 March 2020

కథ కోసం రూ.50 లక్షలు వెచ్చించిన నాని!

సహజ నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాని మొదటి నుంచీ వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుంటున్నారు. ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంపిక చేసుకుంటున్నారు. ‘అష్టాచమ్మా’ సినిమాతో నటుడిగా మొదలైన నాని ప్రయాణం మూడు పువ్వులు ఆరు కాయలు మాదిరిగా సాగుతోంది. అయితే, కిందటేడాది నాని నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా రాణించలేకపోయాయి. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేసిన ‘జెర్సీ’ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది కానీ.. కాసుల వర్షం మాత్రం కురిపించలేకపోయింది. ఇక విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. అయినప్పటికీ నాని జోష్ తగ్గలేదు. ఇప్పుడు ఆయన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. క్రియేటివ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్‌కృష్ణ దర్శకత్వంలో ‘V’ సినిమాను నాని చేస్తున్నారు. ఈ సినిమాలో సుధీర్ బాబు మరో హీరోగా నటిస్తు్న్నారు. నిజానికి ఈ సినిమాలో నానిది నెగిటివ్ రోల్. చాలా క్రూరంగా కనిపించనున్నారు. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. దీంతో పాటు ‘టక్ జగదీశ్’ అనే సినిమాను కూడా నాని మొదలుపెట్టారు. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. ఇక నాని హీరోగా నటిస్తున్న మరో సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’. ఈ మధ్యనే ఒక స్పెషల్ కాన్సెప్ట్ వీడియోతో టైటిల్‌ను ప్రకటించారు. ‘టాక్సీవాలా’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రాహుల్ సంకృత్యాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. Also Read: కాగా, ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికర వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమా కథ కోసం నాని ఏకంగా రూ.50 లక్షలు వెచ్చించారని అంటున్నారు. హైదరాబాద్‌లోని ఓ ఆడియో కంపెనీలో పనిచేస్తున్న మేనేజర్‌ వద్ద ఈ కథను నాని రూ.50 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. కథ బాగా నచ్చడంతో ఎక్కువ మొత్తం ఇచ్చి దాన్ని తీసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. అంతేకాదు, ఈ సినిమా కోసం దిగ్గజ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్‌ను సంప్రదించే పనిలో నాని ఉన్నారట. ఎలాగైనా ఈ సినిమాకు ఆయనతో మ్యూజిక్ చేయించాలని చూస్తున్నారట. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే నాని కానీ, చిత్ర యూనిట్ కానీ స్పందించే వరకు ఆగాల్సిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2U2ZzHt
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...