Friday 28 February 2020

‘ఓ పిట్టకథ’ చెప్పడానికి వస్తోన్న మెగాస్టార్

గతంలో మంచి కమర్షియల్ సినిమాలను నిర్మించిన భవ్య క్రియేషన్స్‌ సంస్థ తొలిసారి కొత్త తారలతో, కొత్త దర్శకుడితో నిర్మించిన చిత్రం ‘ఓ పిట్ట కథ’. విశ్వంత్‌ దుద్దుంపూడి, సంజయ్‌రావు, నిత్యా శెట్టి హీరో హీరోయిన్లుగా బ్రహ్మాజీ కీలకపాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 6న విడుదలకు సిద్ధమవుతోంది. చెందు ముద్దు దర్శకత్వంలో వి.ఆనందప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్చి 1న హైదరాబాద్‌లో ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌లో మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా పాల్గొబోతున్నారు. ఈ విషయాన్ని నిర్మాత ఆనంద ప్రసాద్ శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ‘‘కథను నమ్మి తీసిన సినిమా ఇది. ఇప్పటికే మా ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా చాలా గ్రాండ్‌గా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ చేయనున్నాం. చిరంజీవి గారి రాకతో మా సినిమాకి ఓ కొత్త ఊపు రాబోతుంది. ఆయన ఈ ఫంక్షన్‌కి రావడానికి అంగీకరించినందుకు చాలా చాలా థ్యాంక్స్‌’’ అని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్య చిన్న సినిమాలను బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇటీవల నిఖిల్ సినిమా ‘అర్జున్ సురవరం’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసి ఆ చిత్రంపై అంచనాలను భారీగా పెంచేశారు. నిజానికి చిరంజీవి ప్రమోట్ చేయడం వల్ల నిఖిల్ సినిమాకు మరింత క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ‘ఓ పిట్టకథ’ గురించి చెప్పడానికి వస్తున్నారు. సినిమాలో కంటెంట్ గురించి పక్కన బెడితే చిరంజీవి రాకతో ఇప్పుడు ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు పెరగడం ఖాయం. Also Read: కాగా, ఈ చిత్రంలో బాలరాజు, శ్రీనివాస్‌ భోగిరెడ్డి, భద్రాజీ, రమణ చల్కపల్లి, సిరిశ్రీ, సూర్య ఆకొండి తదితరులు నటించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం సమకూర్చారు. సునీల్ కుమార్ యన్ సినిమాటోగ్రఫీ అందించారు. డి.వెంకట ప్రభు ఎడిటర్. కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం చెందు ముద్దు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2TlVcGZ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...