Wednesday 29 January 2020

Jaanu: 96 రీమేక్ అంటే భయపడి దిల్ రాజుకి నో చెప్పేశా.. కాని!!: సమంత

శర్వానంద్, హీరో హీరోయిన్లుగా నటించిన ‘జాను’ మూవీ ట్రైలర్‌ను బుధవారం నాడు విడుదల చేసింది చిత్ర యూనిట్. తమిళ్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసిన విజయ్ సేతుపతి, త్రిష కాంబో మూవీ ‘96’ను తెలుగులో ‘జాను’ పేరుతో రీమేక్ చేశారు. ఈ మూవీ ట్రైలర్‌ను లాంఛ్ ఈవెంట్‌ను బుధవారం నాడు హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ట్రైలర్ లాంచ్‌లో , సమంత, దిల్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ.. ‘దిల్ రాజుగారు 96 సినిమాను రీమేక్ చేస్తున్నారని తెలియక ముందే తమిళ్‌లో చూశాను. అయితే దిల్ రాజు గారు మా మేనేజర్‌ని కలిసినప్పుడు నేను ఆలోచనలో పడ్డాను. బ్లాక్ బస్టర్ క్లాసిక్‌ని రీమేక్ చేయాలి అంటే.. తమిళ్‌లో త్రిష, విజయ్ సేతుపతిలు అద్భుతమైన పెర్ఫామెన్స్ ఇచ్చారు.. వాళ్లను దృష్టిలో పెట్టుకుని నేను ఈ సినిమా చేయడానికి చాలా భయపడ్డా. కాని నాకు తెలుసు.. నేను దిల్ రాజు గారిని కలిస్తే ఓకే చెప్పేస్తాను అని.. అందుకే చాలా రోజుల వరకూ ఆయన్ని కలవకుండా నో.. నో అంటూ వచ్చా. దిల్ రాజుతో మాట్లాడితే కాన్ఫిడెంట్ వచ్చేస్తోంది. ఎందుకంటే నేను హైదరాబాద్‌లో అడుగుపెట్టిందే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ ఆఫీస్‌లో. నా ప్రయాణం అక్కడ నుండే ప్రారంభమైంది. ఈ విషయంలో నేను దిల్ రాజు గారికి థాంక్స్ చెప్పాలి. ఈ సినిమాలో నాతో పాటు శర్వానంద్ చేస్తున్నారన్నప్పుడు ఇంకా కాన్ఫిడెంట్ పెరిగింది. షూటింగ్ ప్రారంభమైన తరువాత ఒక్కరోజు కూడా కష్టపడకుండా లేము. ఎందుకంటే.. ప్రతి సీన్‌లోనూ మ్యాజిక్ జరిగాలి అన్నట్టుగానే పనిచేశాం. పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి చాలా కష్టపడ్డాం. ఈ సినిమాతో నాకు మంచి పేరు వస్తుంది అంటే.. అది కేవలం శర్వానంద్‌తో నా రిలేషన్ షిప్ ఆన్ స్క్రీన్‌పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లోనూ బాగా వర్కౌట్ కావడమే. ప్రతి సీన్ గురించి ఇద్దరం బాగా డిస్కస్ చేసేవాళ్లం. నేను అందరికీ ఎందుకు థాంక్స్ చెప్తున్నానంటే ఆల్రెడీ నా సెన్స్ చెప్తుంది ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని. తప్పకుండా మ్యాజిక్ జరిగిందనే నమ్ముతున్నాం’ అంటూ చెప్పుకొచ్చారు సమంత.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2U55NYT
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...