Thursday 30 January 2020

జనం ఫిక్స్.. చంద్రబాబే మళ్లీ సీఎం: హీరోగారు మళ్లీ వచ్చారండోయ్

గత ఎన్నికల్లో వైసీపీకి 151 స్థానాలల్లో గెలిపించి జగన్‌కు తిరుగులేని విజయాన్ని అందించారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లు. అయితే ఎన్నికల ముందు ఖచ్చితంగా తిరిగి ముఖ్యమంత్రి అవుతారని చాలామందే భావించారు. రాసిపెట్టుకోండి అని ఒకరంటే.. తొడకొట్టి చెబుతున్నా బాబే సీఎం అంటూ బుద్దా వెంకన్న లాంటి టీడీపీ వీరవిధేయులు తొడలు వాచిపోయేలే కొట్టుకున్నా.. ఓటర్లు మాత్రం జగన్‌కే జై కొట్టారు. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం బాబే సీఎం అంటున్నారు ఆపరేషన్ గరుడ శివాజీ. గత ఎన్నికల్లో చంద్రబాబు విజయానికి శక్తిమేర కష్టపడ్డ ఈ హీరో గారు ఈసారి మాత్రం గురి తప్పుదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. Read Also ఆయన మాట్లాడుతూ.. ‘ఎవరు ఏంటన్నది ప్రజలు నిర్ణయిస్తారు. నా దృష్టిలో చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం రాష్ట్రాన్ని ఎవరూ ఏం చేయలేరు. చంద్రబాబు తరువాత వాళ్ల కుటుంబం నుండి ఎవరు వస్తారన్నది వాళ్లకు సంబంధించిన విషయం. ప్రజలు కోరుకున్నవాళ్లే లీడర్ అవుతారు. నేతలు ప్రజల్లో నుండే పుడతారు. జగన్ మోహన్ రెడ్డి లేకపోతే ఆ ప్లేస్‌లో ఇంకొకరు వస్తారు. చంద్రబాబు లేకపోతే ఇంకొకరు వస్తారు. అప్పట్లో ఇందిరా గాంధీ చనిపోతే రాజీవ్ గాంధీ రాలేదా?.. ఆయన చనిపోయిన తరువాత సోనియా గాంధీ వచ్చారు. వ్యవస్థ నిరంతర ప్రక్రియ.. వ్యక్తులే తాత్కాలికం. వ్యవస్థకు ఎవరు ఏం చేశారన్నదే ముఖ్యం. నా దృష్టిలో చంద్రబాబు గారు ఆంధ్రప్రదేశ్‌కి అవసరం. దీన్ని ప్రజలు కూడా గుర్తించారనే అనుకుంటున్నా. ఒకవేళ ఇంతకన్నా టాలెంట్ ఉన్న వాళ్లను గుర్తిస్తే నేను ఆశ్చర్యపోను. నా అభిప్రాయం ప్రకారం వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మళ్లీ చంద్రబాబు గారే వస్తారు. జనం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు.. మీరు ఏం చేసినా చంద్రబాబే ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారనేది నా అభిప్రాయం. దీన్ని మీరు గౌరవించాల్సిన అవసరం లేదు.. ఒకవేళ నా అభిప్రాయాన్ని వ్యతిరేకించినా.. ఆ హక్కు మీకు ఉంది. నేను దాన్ని గౌరవించాలి’ అంటూ మరోమారు బాబుపై విధేయతను ప్రదర్శించారు .


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2uQsFR5
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...