Tuesday 31 December 2019

‘ప్రతిరోజూ పండగే’ డిలీటెడ్ సీన్: తీసేసి మంచిపని చేశారట!

సినిమాను తెరకెక్కించడం అనేది ఒక పెద్ద ప్రక్రియ. సినిమా మొత్తాన్ని చిత్రీకరించిన తరవాత ఎడిటింగ్ రూమ్‌లో దానికి చాలా కత్తెరలు వేస్తారు. నిడివి తగ్గించడానికో, ఈ సన్నివేశం అవసరంలేదనో కొన్ని సీన్లను తొలగిస్తారు. అలా తొలగించినవాటిలో మంచి సీన్స్ ఉంటే ఈ మధ్య చిత్ర నిర్మాణ సంస్థలు యూట్యూబ్‌లో పెట్టేస్తున్నాయి. వాటికి కూడా మంచి వ్యూస్ వస్తున్నాయి. తాజాగా ‘ప్రతిరోజూ పండగే’ సినిమా నుంచి డిలీట్ చేసిన సీన్‌ను గీతా ఆర్ట్స్ సంస్థ యూట్యూబ్‌లో పెట్టింది. సాయిధరమ్ తేజ్, రాశీ ఖన్నా జంటగా నటించిన చిత్రం ‘ప్రతిరోజూ పండగే’. సత్యరాజ్, రావు రమేష్ కీలక పాత్రలు పోషించారు. మారుతి దర్శకత్వం వహించారు. తమన్ సంగీతం సమకూర్చారు. అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 20న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. ఔట్ అండ్ ఔంట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో తొలగించిన ఒక సన్నివేశాన్ని తాజాగా గీతా ఆర్ట్స్ సంస్థ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. హీరో తాతయ్య రఘురామయ్య తన వ్యవసాయ భూమిలో భార్య సమాధి కట్టుకుంటాడు. ఈ సమాధి వద్దకు వెళ్లే దారి వేరొక పొలంలో నుంచి ఉంటుంది. ఆ పొలాన్ని సింక్ బ్రదర్స్ కొనుగోలు చేస్తారు. పక్కనే ఉన్న రఘురామయ్య స్థలం మీద కూడా కన్నేస్తారు. కానీ, ఆయన అమ్మడానికి ఒప్పుకోరు. Also Read: దీంతో రఘురామయ్య తన భార్య సమాధి వద్దకు వెళ్లకుండా సింక్ బ్రదర్స్ తాము కొనుగోలు చేసిన పొలంలో అడ్డంగా కంచె వేస్తారు. సమాధి వద్దకు వెళ్లడానికి దారిలేక రఘురామయ్య చాలా బాధపడుతూ ఉంటారు. అమెరికా నుంచి వచ్చిన రఘురామయ్య మనవడు సాయి విషయం తెలుసుకుని సింక్ బ్రదర్స్ మనుషులను కొట్టి కంచె పీకి పారేస్తాడు. సింక్ బ్రదర్స్ అక్కడి నుంచి పరారైపోతారు. ఇదంతా సినిమాలో చూపించారు. అయితే, సింక్ బ్రదర్స్ కొనుగోలు చేసిన స్థలం రఘురామయ్య స్నేహితుడు సూర్యనారాయణది. కాకపోతే వీళ్లిద్దరి మధ్య చాలా రోజుల నుంచి మాటలు ఉండవు. దీంతో వీళ్లిద్దరిని కలిపే ప్రయత్నం చేస్తాడు సాయి. తన తాతయ్య కోరిక మేరకు సూర్యనారాయణ మనవరాలు ఏంజెల్ ఆర్నాను పెళ్లిచేసుకోవడానికి సూర్యనారాయణ కుటుంబానికి తగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలో సాయి గురించి సూర్యనారాయణ వద్ద తప్పుగా చెప్పడానికి సింక్ బ్రదర్స్ వస్తారు. కానీ, వాళ్ల మాటలను పక్కనబెట్టి సాయితో కలిసి సూర్యనారాయణ పొలం వద్దకు బయలుదేరుతారు. ఈ సన్నివేశాన్ని సినిమా నుంచి తొలగించారు. ఇప్పుడు దీన్నే యూట్యూబ్‌లో పెట్టారు. ఈ సన్నివేశం ఏమీ అంత గొప్పగా లేదు. ఇదే విషయాన్ని ప్రేక్షకులు కూడా వెల్లడిస్తున్నారు. యూట్యూబ్ వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు. ఈ సన్నివేశం సినిమా నుంచి తొలగించి మంచి పనిచేశారని అంటున్నారు. ఈ సీన్‌ను డిలీట్ చేసినందుకు థ్యాంక్స్ అని కామెంట్స్ చేస్తున్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Qbhbjk
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...