Monday 30 December 2019

‘డాంగ్ డాంగ్’ సాంగ్: మహేష్ బాబు కొత్త స్టెప్పులు.. ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లో చాలా వరకు మ్యూజికల్ హిట్లే. ఆయన సినిమా ఆల్బమ్స్ చాలా బాగుంటాయి. వాటిలో మంచి ఫాస్ట్ బీట్స్ కూడా ఉంటాయి. అయితే, మహేష్ బాబు డ్యాన్స్ మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుందనే విమర్శ ఉంది. అందుకే ఆయన స్టైల్ మార్చారు. సరికొత్త స్టెప్పులతో ఇరగదీశారు. ఫ్యాన్స్‌కి ఫుల్ మీల్స్ అందించారు. మహేష్ బాబు, రష్మి మందన హీరోహీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తోన్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలవుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కోసం కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. ఇక దేవీశ్రీ అందించిన పాటలపై మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. ఫ్యాన్స్ సూపర్ హిట్ సాంగ్స్ అని చెబుతుంటే.. సగటు సంగీత ప్రేమికుడు మాత్రం దేవీ ట్యూన్స్‌పై పెదవి విరిచాడు. అయితే, ఇటీవల విడుదల చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ టైటిల్ సాంగ్ మాత్రం అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా దేవీశ్రీ ప్రసాద్ అందించిన సాహిత్యం, శంకర్ మహదేవన్ గానం అద్భుతమనే చెప్పాలి. కానీ, తాజాగా విడుదలైన ‘డాంగ్ డాంగ్’ పాట ఇప్పటి వరకు విడుదలైన అన్ని పాటలను మరిచిపోయేలా చేస్తోంది. అంత మంచి మోడరన్ బీట్‌తో దేవీ కట్టిపడేశారు. రామజోగయ్య శాస్త్రి ట్రెండీ లిరిక్స్ అందించారు. హిందీ, తెలుగు మిక్స్ చేసి కొట్టారు. నకాష్ అజీజ్, లవిత లోబో సూపర్ ఎనర్జీతో పాటను ఆలపించారు. ఈ పాటలో మరో ప్రత్యేక ఆకర్షణ బిల్కీ బ్యూటీ తమన్నా. మహేష్ బాబుతో కలిసి ఆమె ఈ పాటలో స్టెప్పులేసింది. తమన్నా డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. అయితే, ఈ పాటలో ఆమెతో సమానంగా స్టెప్పులేశారు సూపర్ స్టార్. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ కావడంతో చిత్రీకరణ, డ్యాన్స్ అన్నీ కొత్తగా ఉన్నాయి. మొత్తం మీద ఒక మంచి పార్టీ సాంగ్‌‌ను తన అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్‌గా ఇచ్చారు మహేష్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/37ost9E
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...