Saturday 30 November 2019

వర్మకు షాక్.. ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ సెన్సార్‌కు నో

సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వివాదాస్పద చిత్రం ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ రాజకీయ నాయకుల పాత్రలను ఆధారంగా చేసుకుని వర్మ తీసిన సెటైరికల్ మూవీ ఇది. టైటిల్‌తోనే తీవ్ర వివాదాస్పదమైన ఈ సినిమా ఆ తరవాత టీజర్లు, ట్రైలర్లు, పాటలతో మరింత కాకరేపింది. కులాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్న ఈ సినిమాను, చిత్ర టైటిల్‌ను చాలా మంది తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక కేఏ పాల్ అయితే కోర్టుకెక్కారు. వాస్తవానికి ఈ చిత్రం ఈనెల 29న విడుదల కావాల్సి ఉంది. కానీ, అప్పటికి సెన్సార్ పూర్తికాలేదు. మరోవైపు హైకోర్టులో కేసు కూడా నడుస్తోంది. ఈ సినిమాను సెన్సార్ బోర్డు సభ్యులు చూసి వారం రోజుల్లో తమ అభిప్రాయం చెప్పాలని ఈనెల 28న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు సెన్సార్ బోర్డు సభ్యులు శనివారం ఈ చిత్రాన్ని చూశారు. ఇది చాలా వివాదాస్పద చిత్రమని, దీనికి సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేది లేదని సభ్యులు తేల్చి చెప్పినట్టు సమాచారం. దీంతో సెన్సార్ బోర్డు నిర్ణయంపై రివైవల్ కమిటీకి రామ్ గోపాల్ వర్మ ఫిర్యాదు చేయనున్నారని తెలిసింది. Also Read: ఇదిలా ఉంటే, ‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ టైటిల్‌పై సెన్సార్ బోర్డు అభ్యంతరం తెలిపితే దాన్ని మార్చడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ చెప్పారు. దీనికి ప్రత్యామ్నాయంగా ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ అనే టైటిల్‌ను అనుకున్నామని స్పష్టం చేశారు. అయితే, సెన్సార్ బోర్డు కేవలం చిత్ర టైటిల్ మీదే కాకుండా కంటెంట్‌పై కూడా అభ్యంతరం తెలిపింది. చంద్రబాబునాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, కేఏ పాల్ వంటి ప్రముఖుల పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగేలా చిత్రంలో సన్నివేశాలు ఉండటంతో సెన్సార్‌ చేయడానికి నో చెప్పింది. Also Read:


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2L87WxA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...