Friday 29 November 2019

‘హీరోలు పెంచాల్సింది కండలు కాదు బుర్రలు’

ఎన్నో ఆశలతో ఇప్పుడిప్పుడు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న యంగ్ నటులకు ఓ సలహా ఇచ్చారు అలనాటి బాలీవుడ్ నటుడు . వారంతా కండలు పెంచి ఇండస్ట్రీలోకి వస్తున్నారని, కానీ పెంచాల్సింది కండలు కాదని అన్నారు. బుర్రలు పెంచాలని సూచించారు. ఈ విషయాన్ని రిషి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ఈరోజుల్లో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న నటులు ఎక్కువగా బాడీ బిల్డింగ్‌పై శ్రద్ధ పెడుతున్నారు. బాడీ ఉంటేనే ఛాన్స్‌లు వస్తాయని అనుకుంటున్నారు. కానీ ఇప్పటి నటులకు కావాల్సింది ఎమోషనల్ వ్యాయామం. ఇది నటులకు చాలా అవసరం. బాడీని పెంచుకునే బదులు బుర్రలు పెంచుకోండి. ఎందుకంటే నటించే నైపుణ్యాలు, మంచి కాన్సెప్ట్స్‌ని ఎంచుకునే సామర్ధ్యాలు ఉంటే తప్పకుండా యాక్టర్ అవుతారు. అలాంటివేమీ లేకపోతే సులువుగా వేరొకరు వచ్చి వారి స్థానాలను భర్తీ చేస్తారు. నన్ను చూడండి. నాకు సిక్స్ ప్యాక్ బాడీ ఉందా? కానీ ఇప్పటికీ నేను సినిమాలు చేస్తున్నాను. ఎందుకంటే ప్రతీ సినిమాలో నా క్యారెక్టర్‌ను నేనే క్రియేట్ చేస్తారు. నాకు వయసైపోయి ఉండొచ్చు. యంగస్టర్స్‌కు నేను రోల్ మోడల్ కాను’ ‘కానీ ఆయుష్మాన్ ఖురానా, రాజ్‌కుమార్ రావు, రణ్‌వీర్ సింగ్, విక్కీ కౌశల్‌, రణ్‌బీర్ కపూర్‌లను చూడండి. రణ్‌బీర్ నా కొడుకు కాబట్టి వాడి పేరు చెప్పడంలేదు. కానీ రణ్‌బీర్ కూడా టాలెంటెడ్ నటుడే. వారెవ్వరికీ భారీ శరీరాకృతులు లేవు. ఎందుకంటే కేవలం బాడీలుంటే నటులు అయిపోరు. జిమ్‌కి వెళ్లి డబ్బులు ఖర్చు చేస్తే యాక్టర్స్ అయిపోరు. దాని వల్ల డబ్బు పోవడం తప్ప ఏమీ ఉండదు. అమితాబ్ బచ్చన్‌ని చూడండి. ఆయన సినిమాల్లోకి అడుగుపెట్టినప్పుడు చాలా సన్నగా ఉండేవారు. ఇప్పటికీ అలాగే ఉన్నారు. 70 ఏళ్ల వయసులోనూ ఆయన్ను యాంగ్రీ యంగ్ మ్యాన్ ఆఫ్ హిందీ సినిమా అంటుంటారు’ అని తెలిపారు. రిషి కపూర్ క్యాన్సర్ ట్రీట్‌మెంట్ కోసం అమెరికాలో ఉన్నప్పుడు ఇప్పటికీ అక్కడి ఆడియన్స్ ఆయన సినిమాలను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ విషయం తెలిసి షాకయ్యానని రిషి తెలిపారు. ‘ఇప్పటికీ ఇంటర్నేషనల్ ఆడియన్స్ నా సినిమాలు ఎంజాయ్ చేస్తున్నారని తెలిసినప్పుడు నేను నటించిన పది సినిమాల పేర్లు చెప్పి వాటిని కూడా చూడమని చెప్పాను. వాటిలో నేను అమితాబ్ కలిసి నటించిన ‘102 నాటౌట్’ సినిమా కూడా ఉంది. ఆ మరుసటి రోజు ఓ పెద్ద మనిషి బొకే తీసుకుని నా ఇంటికి వచ్చాడు. ‘102 నాటౌట్’ సినిమా చూశానని చెప్తూ ఏడ్చాశాడు. నా ఆస్తి కోసం నేనెప్పుడు చస్తానా అని నా కొడుకు ఎదురుచూస్తున్నాడు సర్ అంటూ కన్నీరుపెట్టుకున్నాడు. అప్పుడే నాకు తెలిసింది సినిమా వేలాది మంది మనసులను కదిలించగలదు అని. నాకు అతన్ని చూసి చాలా బాధేసింది’ అని వెల్లడించారు రిషి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34JI9Up
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...