Saturday 30 November 2019

నా కూతురూ డాక్టరే.. అలా జరిగితేనే సొసైటీలో భయం ఉంటుంది: ఆలీ

రెండు రోజుల క్రితం హైదరాబాద్ శివారులో జరిగిన వెటర్నరీ డాక్టర్ హత్యాచార ఘటన చాలా బాధకరమని సినీ నటుడు, కమెడియన్ ఆలీ అన్నారు. ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనతో నార్త్ ఇండియా మొత్తం కదిలిపోయిందని.. ఇన్ని సీసీటీవీ కెమెరాలు, ఇంత మంది పోలీసులు ఉన్నప్పటికీ హైదరాబాద్ నడిబొడ్డులో ఇలాంటి ఘటన జరగడం ఘోరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమె తల్లిదండ్రులను ఆలీ పరామర్శించారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ ఘటన ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో గ్రామాల్లో జరగలేదు. సిటీలో జరిగింది. సిటీ నడిబొడ్డున జరిగింది. నిమిషానికి కొన్ని వందలు కార్లు తిరిగే హైవే పక్కన ఈ ఘటన జరిగిందంటే చాలా బాధాకరం. బాధితురాలి తండ్రి మాజీ ఆర్మీ ఉద్యోగి. ఆయన దేశానికి ఎంతో సేవ చేశారు. అలాంటి కుటుంబానికి ఇలా జరగడం చాలా బాధాకరం. ఆ ఫ్యామిలీకే కాదు ఏ కుటుంబానికి ఇలా జరగకూడదు. Also Read: 25 సంవత్సరాలు గుండెలపై మోసి పెంచుకున్న కూతురు, పైగా ఒక డాక్టర్ ఇలా ప్రాణాలు కోల్పోవడం జీర్ణించుకోలేని విషయం. శవం కూడా దొరకకుండా చేశారు. కనీసం శవమైనా దొరుకుంటే తల్లిదండ్రులు ఇంతగా బాధపడేవారు కాదు. ఒక రెండు కేజీల ముద్దను వాళ్ల చేతిలో పెట్టారు. ఆ తండ్రి గుండెకోత, ఆ తల్లి కడుపుకోత వేరే ఎవరికీ రాకూడదు. నేను ఈ కుటుంబాన్ని పరామర్శించడానికీ ఒక కారణం ఉంది. నా కూతురు కూడా డాక్టర్ చదువుతోంది. చనిపోయిన అమ్మాయి కూడా నా కూతురులాంటిదే. ఆమె తల్లిదండ్రులను చూస్తుంటే నా గుండె కరిగిపోయింది. దోషులను షూట్ చేయొద్దు, ఉరి తీయొద్దు.. నా కూతురుకి జరిగిందే వాళ్లకూ జరిగితే సొసైటీలో భయం ఉంటుంది.. నా కూతురి ఆత్మ శాంతిస్తుంది అని ఆ తల్లి చెప్పి ఏడుస్తుంటే నిజంగా నాకు చాలా బాధేసింది. దోషుల తరఫున వాదించకూడదని బార్ కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకుందని విన్నాను. కచ్చితంగా ఈ ఫ్యామిలీకి న్యాయం జరిగేలా చూసే బాధ్యత మనపై ఉంది’’ అని ఆలీ వెల్లడించారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2LaSZe9
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...