Wednesday 30 October 2019

నాగబాబు బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన వరుణ్, నిహారిక.. మెగా ఫ్యామిలీ సందడి

మెగా బ్రదర్ నాగబాబు పుట్టినరోజు వేడుక హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ఘనంగా జరిగింది. తండ్రి నాగబాబు బర్త్‌డేను వరుణ్ తేజ్, నిహారికా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. మంగళవారం రాత్రి జరిగిన ఈ వేడుకలో మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా పాల్గొన్నారు. చిరంజీవి-సురేఖ, రామ్ చరణ్-ఉపాసన, అల్లు అర్జున్-స్నేహా, కళ్యాణ్ దేవ్-శ్రీజ దంపతులు సహా కొణిదెల, అల్లు కుటుంబాలకు చెందిన సభ్యులంతా హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Also Read: కాగా, 1961 అక్టోబర్ 29న పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించిన నాగబాబు నిన్నటితో 58 సంవత్సరాలు పూర్తిచేసుకుని 59వ ఏట అడుగుపెట్టారు. అన్నయ్య చిరంజీవి టాలీవుడ్‌లో స్టార్ హీరోగా మారిన రోజుల్లోనే నాగబాబు కూడా నటుడిగా తెరంగేట్రం చేశారు. చిరంజీవి హీరోగా నటించిన ‘రాక్షసుడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు నటుడిగా నాగబాబు పరిచయం అయ్యారు. ఆ తరవాత వరుసగా చిరంజీవి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. అక్కడి నుంచి చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ మెప్పించారు. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ నాగబాబు టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సోదరులు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌తో సినిమాలు చేశారు. అయితే, ‘ఆరెంజ్’ సినిమా నాగబాబుకు కోలుకోలేని దెబ్బ కొట్టింది. ఆ తరవాత ఆయన మరో సినిమాను నిర్మించలేకపోయారు. ప్రస్తుతం ఆయన తనయుడు వరుణ్ తేజ్ హీరోగా రాణిస్తున్నారు. మరోవైపు, నాగబాబు ‘జబర్దస్త్’ కామెడీ షోతో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైపోయారు. Also Read: ఇదిలా ఉంటే, మంగళవారం తన తండ్రి నాగబాబు పుట్టినరోజును పురష్కరించుకుని ట్విట్టర్ ద్వారా వరుణ్ తేజ్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. నీ ముఖంలో చిరునవ్వు కోసం నేను ఏమైనా చేస్తాను. నాకు అద్భుతమైన జీవితాన్ని ఇచ్చిన నీకు కృతజ్ఞతలు. నీకన్నా ఇష్టమైనది నాకు ఏమీ లేదు’’ అని వరుణ్ ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే, నిహారిక కూడా తండ్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. తండ్రి నుదిటిపై ప్రేమగా ముద్దుపెడుతున్న ఫొటోను కూడా ట్వీట్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/34cQGOQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...