Tuesday 29 October 2019

రేప్ చేస్తుంటే ప్రూఫ్స్ కలెక్ట్ చేస్తూ కూర్చోవాలా: గాయని ఆగ్రహం

మీటూపై షాకింగ్ ఆరోపణలు చేసిన వారిలో ప్రముఖ గాయని ఒకరు. ప్రముఖ గాయకుడు అను మాలిక్ ‌తనను లైంగికంగా వేధించాడని ఏడాది క్రితం సోనా షాకింగ్ ఆరోపణలు చేశారు. సోనాతో పాటు గాయని శ్వేతా పండిట్‌ కూడా అను మాలిక్ నిజ స్వరూపం బయటపెట్టారు. మ్యాటర్ సీరియస్ అవడంతో ప్రముఖ సింగింగ్ రియాల్టీ షో ఇండియన్ ఐడల్ నుంచి అను మాలిక్‌ను తొలగించారు. ఈ షోకు ఆయన జడ్జ్‌గా వ్యవహరించేవారు. కానీ సోనాకు న్యాయం జరగలేదు. అను మాలిక్‌ను తొలగించిన తర్వాత సోనాను కూడా తీసేశారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే.. అను మాలిక్‌పై మీటూ ఆరోపణలు ఉన్నప్పటికీ అతన్ని మళ్లీ ఇండియల్ ఐడల్ సీజన్ 11 జడ్జ్‌గా నియమించారు. దాంతో సోనాకు చిర్రెత్తుకొచ్చింది. ట్విటర్ వేదికగా తన ఆగ్రహాన్ని ప్రదర్శించారు. ‘అను మాలిక్ నన్ను లైంగికంగా వేధించాడు అని ఎన్నోసార్లు నోరుబాదుకున్నాను. కానీ ఎవ్వరూ నా మాట వినలేదు. ఇండియాలో మరో నిర్భయ సంఘటన జరిగే తప్ప ఎవ్వరూ మేలుకోరా? అనుపై నేను ఆరోపణలు చేయడంతో నన్ను షో నుంచి తీసేశారు. నేను అనుపై ఆరోపణలు చేయడంతో మరో టీవీ ఛానెల్ రేటింగ్స్ బాగా పెరిగిపోయానని చెప్పారు. ఏడాది తర్వాత ఆ కామాంధుడిని మళ్లీ జడ్జ్‌ సీట్‌‌ను కట్టబెట్టారు. నేను ఎప్పుడు ఆరోపణలు చేసినా కూడా ప్రూఫ్ ఉందా అని చాలా మంది అడిగారు. రేప్ చేస్తున్నప్పుడు, లైంగికంగా వేధిస్తున్నప్పుడు ఆడపిల్లలు ప్రూఫ్‌లు కలెక్ట్ చేస్తూ ఉండాలని ఈ వెధవల అభిప్రాయం’ ‘ అను మాలిక్ గురించి తెలిసి కూడా మిగతా ఇద్దరు సింగర్స్‌ ఆయనతో కలిసి ఎలా పనిచేస్తున్నారో నాకు అర్థంకావడంలేదు. ఎంతైనా అందరికీ డబ్బే ముఖ్యం కదా. అను మాలిక్‌కు మళ్లీ జడ్జ్ సీట్ ఎందుకు కట్టబెట్టారని నేను సింగర్ విశాల్ దద్లానీని అడిగాను. చాలా చర్చలు జరిగాయని విశాల్ నాకు చెప్పాడు. పైగా ఇలా మాట్లాడినందుకు తన పేరు బయటపెట్టొద్దని చెప్పాడు. నేను ఏం బయటపెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నువ్వు చెప్పిన దాంట్లో ఒక్క లాజిక్ కూడా లేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు సోనా.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2qLTmEz
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...