Tuesday 29 October 2019

‘Bigg Boss చెత్త షో, నాపై కిలో కారంపొడి చల్లారు’

బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ కాన్ టీఆర్‌పీ రేటింగ్స్‌ కోసం జనాల ప్రాణాలతో చెలగాటం ఆడటానికి కూడా వెనుకాడడని అనిపిస్తోంది. ఆయన హోస్ట్ చేస్తున్న సెలబ్రిటీ రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్ 13లో కంటెస్టెంట్ల చేత ఘోరమైన టాస్క్‌లు చేయిస్తున్నాడు. ఇటీవల బిగ్ బాస్ హౌస్‌లో ఓ టాస్క్ పెట్టారు. ఈ టాస్క్‌లో భాగంగా సిద్ధార్థ్ డే అనే కంటెస్టెంట్‌పై మిగతా హౌస్‌మేట్స్ ఏకంగా కిలో బ్లీచ్ పౌడర్ చల్లారట. అంతటితో ఆగలేదు అరకిలో కారం పొడి తెచ్చి అతనిపై పోశారట. దాంతో అతని మెడ వద్ద చర్మం ఊడిపోయింది. గత వారం ఈ షో నుంచి బయటికి వచ్చేసిన సిద్ధార్థ్ మీడియా ముందుకు వచ్చి తన గోడును చెప్పుకున్నాడు. ‘బిగ్ బాస్ హౌస్‌లో టాస్క్‌లో భాగంగా నాపై బ్లీచ్, కారం పొడి చల్లారు. నా శరీరంపై చర్మం ఊడిపోయింది. ఇప్పుడిప్పుడే నేను కోలుకుంటున్నాను. ఈ టాస్క్ వల్ల చాలా రోజుల పాటు నిద్రపోలేకపోయాను. సెలబ్రిటీలు అయివుండి ఇలాంటి పనులు చేస్తే యువతకు రాంగ్ మెసేజ్ ఇచ్చినవారవుతారు. తొలి టాస్క్‌లోనే నాచేత మట్టి, మిరపకాయలు తినిపించారు. నాకు ఛాన్స్ వచ్చినప్పుడు నా తోటి కంటెస్టెంట్స్‌తో నేను అలా చేయలేదు. ఎందుకంటే టాస్క్‌ కోసం నేను మరొకరిని హింసపెట్టే వ్యక్తిని కాను. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే పనులు చేయొచ్చు కానీ కారం పొడి, బ్లీచ్ చల్లితే అది ఎంటర్‌టైన్మెంట్ ఎలా అవుతుందో నాకు అర్థంకావడంలేదు’ అని వెల్లడించాడు సిద్ధార్థ్. దాంతో నెటిజన్లు సల్మాన్ ఖాన్‌పై, బిగ్ బాస్ షోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్ధార్థ్‌కు అయిన గాయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అతనికి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. బిగ్ బాస్ హౌస్‌లో ఇంత జరుగుతున్నా వాటిని ఎందుకు ఛానెల్‌లో చూపించడంలేదని ప్రశ్నిస్తున్నారు. సల్మాన్ మాత్రం ఈ ఘటన గురించి ఇంతవరకు స్పందించింది లేదు. వీకెండ్ ఎపిసోడ్‌లో హౌస్‌లో ఏం జరుగుతోందో సల్మాన్ రివ్యూ చేస్తాడు. ఓ కంటెస్టెంట్‌కు అంతటి గాయాలు అయినప్పటికీ సల్మాన్ స్పందించకపోవడం గమనార్హం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2q3BdBQ
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...