Monday 30 September 2019

‘14 సినిమాలు ఫ్లాప్స్ వచ్చాయ్.. నా కెరీర్ అయిపోయిందనుకున్నా’

బాలీవుడ్‌లో ఖాన్‌లకు పోటీగా నిలిచారు నటుడు అక్షయ్ కుమార్. ఆయన నటించే ఏ సినిమా అయినా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరాల్సిందే. హిట్స్ ఉన్నా లేకపోయినా ఏడాదికి వరుసగా నాలుగైదు సినిమాలు చేయాల్సిందే. ఆ సత్తా అక్షయ్ కుమార్‌కి మాత్రమే ఉంది. అయితే ఏ హీరో, హీరోయిన్ కెరీర్‌లో అయినా ఫ్లాప్స్ కామనే. కెరీర్‌లోనూ బోలెడన్ని ఫ్లాప్ సినిమాలు ఉన్నాయ్. అయితే ఆయన స్టా్ర్‌డం ముందు ఆ ఫ్లాప్‌లన్నీ తుస్సుమన్నాయ్. కానీ తన కెరీర్ రోడ్డు మీదకు వచ్చేసిందనే అనుకున్నారట అక్షయ్. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘ముప్పై ఏళ్లుగా ఈ ఇండస్ట్రీలో కొనసాగుతున్నా. నా కెరీర్‌లో 14 ఫ్లాప్ సినిమాలు ఉన్నాయ్. దాంతో నా జీవితం రోడ్డు మీదకు వచ్చేసిందనుకున్నా. నా మీద నాకే నమ్మకం లేకుండాపోయింది. కానీ నాకు మార్షల్ ఆర్ట్స్‌లో పట్టు ఉంది కాబట్టి డిసిప్లైన్డ్‌గా ఎలా ఉండాలో నేర్పింది. ఆ 14 ఫ్లాప్‌లు నేర్పిన గుణపాఠం వల్లే ఈరోజు నేను హిట్ సినిమాలు చేయగలుగుతున్నా’ అన్నారు. మార్షల్ ఆర్ట్స్‌పై మంచి పట్టు ఉన్న నటుడు కాబట్టే ఎక్కవగా ఆయన యాక్షన్ కాన్సెప్ట్ ఉన్న సినిమాల్ల నటిస్తున్నారు. అంతేకాదు కామెడీ, హార్రర్, సోషల్ మెసేజ్, థ్రిల్లర్ సినిమాల్లోనూ నటించారు. ఆయన నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ‘రుస్తుం’కు జాతీయ అవార్డును అందుకున్నారు. ఇటీవల కాలంలో అక్షయ్ నటించిన ‘ఎయిర్‌లిఫ్ట్, టాయ్‌లెట్- ఏక్ ప్రేమ్‌కథా, మిషన్ మంగళ్, స్పెషల్ 26, ఓఎంజీ సినిమాలు మంచి విజయాలు అందుకున్నాయి. అందుకే ఆయన అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా టాప్ 100 సెలబ్రిటీల లిస్ట్‌లో చోటు సంపాదించుకున్నారు. ప్రస్తుతం అక్షయ్ ‘హౌస్‌ఫుల్ 4’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఫర్హాద్ సంఝీ దర్శకత్వం వహించారు. ఇందులో ఆయనతో పాటు రితేష్ దేశ్‌ముఖ్, బాబీ డియోల్, కృతి సనన్, కృతి కర్బంద, పూజా హెగ్డే మెయిన్ రోల్స్‌లో నటించారు. అక్టోబర్ 26న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు ఆయన ‘లక్ష్మీ బాంబ్’, ‘సూర్యవంశి’ ‘పృథ్వీరాజ్’ సినిమాలతో బిజీగా ఉన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2nLRIRX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...