Saturday 31 August 2019

తగ్గనంటున్న చిరు.. ఆ రోజు ‘వార్’కి సిద్ధమే!

మెగాస్టార్ డ్రీం ప్రాజెక్ట్ ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ ఎప్ప్పుడో కంప్లీట్ చేసుకుంది. సినిమాలో బలమైన కంటెంట్ ఉంది. బాలీవుడ్‌కి సైతం బాగా పట్టే పేట్రియాటిక్ కంటెంట్ ఉంది. అందుకే దాన్ని నేషనల్ ప్రాజెక్ట్‌గా మలచాలని భావించిన రామ్ చరణ్ అనుకున్నట్టుగానే 250 కోట్ల రూపాయల ఖర్చుతో ‘సైరా’ని నిర్మించాడు. మధ్యలో కొన్ని అవాంతరాలు వచ్చినా అనుకున్న టైంలోనే సినిమాని పూర్తి చేసారు. ఈ సినిమాని బాలీవుడ్‌లో రిలీజ్ చెయ్యడానికి ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ కూడా ముందుకు వచ్చింది. పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఆనవాయితీ ప్రకారం బాలీవుడ్‌లో ఒక ఈవెంట్ చేసి మరీ ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు. ఆ టీజర్‌లోనే అక్టోబర్ 2న రిలీజ్ అని స్పష్టం చేశారు. అయితే బాలీవుడ్‌లో బడా ప్రొడక్షన్ హౌస్ అయిన యష్ రాజ్ ఫిలిమ్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న బిగ్గెస్ట్ మల్టీస్టారర్ ‘వార్’ కూడా అదే రోజు రిలీజ్ అవుతుంది. యూత్‌లో, మాస్‌లో భారీ ఫాలోయింగ్ ఉన్న హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌తోనే అంచనాలు పెంచేసింది. హాలీవుడ్ స్టైల్ మేకింగ్‌తో, హై‌వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్‌తో సూపర్ ఫీస్ట్ ఇచ్చేలా ఉంది. అంతేకాదు, ఈ సినిమాలో ఉన్న పాయింట్ కూడా ఆసక్తికరంగా ఉంది. ‘సైరా’లో అమితాబ్ ఉన్నా హృతిక్, టైగర్‌లు నటించిన సినిమాకే హిందీ ప్రేక్షకులు ప్రాధాన్యత ఇస్తారు. అంత పెద్ద సినిమాతో పోటీపడడం ఇష్టం లేక ‘సైరా’ని రేస్‌లో నుండి తప్పిస్తున్నారు అని వార్తలు వచ్చాయి. ఒక వారం లేటుగా, అంటే అక్టోబర్ 8న ‘సైరా’ రిలీజ్ కాబోతుంది అనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. అయితే, ఈ విషయంపై సైరా పీఆర్ టీమ్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారం సైరా వాయిదా అనే వార్తలో ఏ మాత్రం నిజం లేదు. అది బాలీవుడ్‌లో కావాలని పుట్టించిన ఫీలర్ అని తేల్చేసారు. చాలా ఆలోచించే, అన్నీ పరిగణనలోకి తీసునే ‘సైరా’ డేట్ అనౌన్స్ చేశారు. వీఎఫ్ఎక్స్ పనులు అనుకున్న టైంకి కంప్లీట్ కావడానికి ప్రత్యేకంగా ఒక టీమ్‌ని కూడా నియమించారు. ఇక మిగిలిన పోస్ట్‌ప్రొడక్షన్‌ని రెండు షిఫ్ట్స్‌లో పనిచేస్తూ కంప్లీట్ చేస్తున్నారు. తాము రిలీజ్ గురించి చాలా పకడ్బందీగా ఉన్నాం అని, ఆన్ టైంలో సైరా థియేటర్స్‌లోకి రావడం ఖాయం అని అంటున్నారు. అయితే రీ ఎంట్రీ మూవీ ‘ఖైదీ నెంబర్ 150’ కేవలం ఒకే భాషలో రూ.100 కోట్ల కలెక్షన్స్ కొల్లగోట్టడంతో, సైరా కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ. 250 కోట్లు వసూలు చేయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో, అలాగే ఓవర్సీస్‌లో సైతం ‘సైరా’ హవా కొనసాగబోతుంది. అందుకే కేవలం ఒక్క లాంగ్వేజ్ గురించి ‘సైరా’ని వాయిదా వేస్తారు అనుకోవడం అమాయకత్వమే. ‘వార్‌’కి ఏ మాత్రం నెగెటివ్ టాక్ వచ్చినా ఆల్టర్నేటివ్ ఆప్షన్ ‘సైరా’ మాత్రమే. అందుకే ఏది ఏమైనా ‘సైరా’ అక్టోబర్ 2న రావడానికి రెడీ అవుతుంది. ‘సైరా’ వెర్సస్ ‘వార్’ అనే ఆసక్తికరమైన పోరుకు ఫిక్స్ అయిపోవచ్చు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2UiiL3u
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...