Wednesday 31 July 2019

‘మగధీర’ జ్ఞాపకాలు.. రెండు సెకెన్ల సీన్ ‘బొమ్మ’ చూపించింది!

తెలుగు సినిమా మార్కెట్‌ను, లెక్కలను మార్చేసిన చిత్రం ‘మగధీర’. అప్పటి వరకు ఉన్న లెక్కలు వేరు.. ‘మగధీర’ వచ్చిన తరవాత లెక్కలు వేరు. చిరంజీవి సినీ వారసుడిగా ‘చిరుత’ చిత్రంలో తెరంగేట్రం చేసిన రామ్ చరణ్ ‘మగధీర’ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు. స్టార్ హీరో హోదాను పొందారు. రాజమౌళి కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రం ‘మగధీర’ అంటే అతిశయోక్తికాదు. ఎస్.ఎస్.రాజమౌళి తన దర్శక ప్రతిభ ఏపాటిదో ఈ చిత్రంతో మరోసారి నిరూపించారు. ఇలాంటి గొప్ప చిత్రం వచ్చి పదేళ్లు గడిచిపోయింది. ‘మగధీర’ పదేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన గీతా ఆర్ట్స్ ఒక ఆసక్తికర వీడియోను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. ‘మగధీర’లో ‘పంచదార బొమ్మ’ పాట ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. ఈ మెలోడీ ఇప్పటికీ మెగా అభిమానులకు ఫేవరేటే. ఈ పాటలో జలపాతాన్ని చీల్చుకుంటూ రామ్ చరణ్ బయటకు వచ్చే సన్నివేశం ఉంటుంది. వాస్తవానికి ఇది రెండు సెకెన్ల సీన్. ఈ సీన్ కోసం దర్శకుడు రాజమౌళితో పాటు చిత్ర యూనిట్ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ సీన్ మేకింగ్ వీడియోను గీతా ఆర్ట్స్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. ఈ వీడియో చూస్తుంటే పర్ఫెక్షన్ కోసం రాజమౌళి ఎంత కష్టపడతారో, ఎంత కష్టపెడతారో అర్థమవుతుంది. ఈ పాటను హైదరాబాద్‌లోని గోల్కొండ కోటలో చిత్రీకరించారు. యం.యం.కీరవాణి స్వరపరిచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. అనూజ్ గుర్వారా, రీటా ఆలపించారు. కాగా, 2009 జూలై 31న ‘మగధీర’ చిత్రం విడుదలైంది. కాళ భైరవుడిగా రామ్ చరణ్ తన విశ్వరూపాన్ని చూపించారు. ఈ సినిమాతో కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. సుమారు రూ.40 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.80 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. ఈ చిత్రంతో తన స్టామినాను రాజమౌళి మరోసారి నిరూపించుకున్నారు. అంతేకాదు, తెలుగు సినిమా మార్కెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. కీరవాణి సంగీతం, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ, పీటర్ హెయిన్ ఫైట్స్, ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ ఇలా ఈ సినిమాలో ప్రతి అంశం ఎంతో ప్రత్యేకం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2Ovp8B6
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...