Monday 29 July 2019

దూసుకెళ్తున్న దేవరకొండ.. ‘డియర్ కామ్రేడ్’కు డీసెంట్ కలెక్షన్స్

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తన స్టామినా ఏంటో మరోసారి చూపిస్తున్నారు. విజయ్, రష్మిక మందన హీరోహీరోయిన్లుగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా ఈనెల 26న విడుదలైన విషయం తెలిసిందే. అయితే, ప్రేక్షకుల నుంచి ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. అయినప్పటికీ ఆ ప్రభావం సినిమా వసూళ్లపై పడలేదు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ చిత్రం తొలిరోజు రూ.11 కోట్లు వసూలు చేసింది. యూఎస్‌లో సైతం తొలిరోజు ప్రీమియర్ల ద్వారా సుమారు 3 లక్షల డాలర్లు (సుమారు రూ.2 కోట్లు) రాబట్టింది. అయితే.. శని, ఆదివారాల్లో ఈ సినిమా కలెక్షన్లు కాస్త తగ్గినట్టు తెలుస్తోంది. మూడు రోజుల్లో ‘డియర్ కామ్రేడ్’ ప్రపంచ వ్యాప్తంగా సుమారు రూ.35 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని అంటున్నారు. దీనిలో డిస్ట్రిబ్యూటర్ల షేర్ రూ.19.28 కోట్లుగా ఉందని సమాచారం. శని, ఆదివారాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం సుమారు రూ.3 కోట్ల చొప్పున గ్రాస్ వసూలు చేసిందని తెలిసింది. మరోవైపు, యూఎస్‌లో ‘డియర్ కామ్రేడ్’ మంచి వసూళ్లు రాబడుతోంది. ఇప్పటి వరకు 7 లక్షల డాలర్లకు పైగా (సుమారు రూ.5 కోట్లు) వసూలు చేసినట్లు యూఎస్‌లో ఈ సినిమాను విడుదల చేసిన ‘సరిగమ సినిమాస్’ ట్వీట్ చేసింది. ప్రాంతాల వారీగా ‘డియర్ కామ్రేడ్’ షేర్ వివరాలు నైజాం - రూ. 5.66 కోట్లు సీడెడ్ - రూ. 1.34 కోట్లు నెల్లూరు - రూ. 0.48 కోట్లు గుంటూరు - రూ. 1.03 కోట్లు కృష్ణా - రూ. 0.73 కోట్లు పశ్చిమ గోదావరి - రూ. 0.83 కోట్లు తూర్పు గోదావరి - రూ. 1.20 కోట్లు ఉత్తరాంధ్ర - రూ. 1.56 కోట్లు దేశంలో ఇతర ప్రాంతాలు - రూ. 3.30 కోట్లు ఓవర్సీస్ - రూ. 3.15 కోట్లు మొత్తం మూడు రోజుల్లో ‘డియర్ కామ్రేడ్’ షేర్ కలెక్షన్: రూ. 19.28 కోట్లు


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2KaoELA
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...