Monday 29 July 2019

‘డియర్ కామ్రేడ్’ రీమేక్‌కు భారీ ధర.. బాలీవుడ్‌లో ఇదో రికార్డ్!

సెన్సేషనల్ స్టార్ , కన్నడ బ్యూటీ రష్మిక మందన జంటగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. సినిమా బాగుందని కొంత మంది అంటే.. బాలేదని మరికొందరు అంటున్నారు. సినిమా టాక్ ఎలా ఉన్నా దీని హిందీ రీమేక్ హక్కులకు పలికిన ధర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విడుదలకు ముందే ఈ సినిమాను చూసిన బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్.. ‘డియర్ కామ్రేడ్’ చాలా బాగుందంటూ కొనియాడారు. ఈ చిత్రాన్ని హిందీలో తానే రీమేక్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే, ‘డియర్ కామ్రేడ్’ హిందీ రీమేక్ హక్కుల కోసం కరణ్ జోహార్ ఏకంగా రూ.6 కోట్లు చెల్లించారని ఫిల్మ్ నగర్ టాక్. ఇదే నిజమైతే.. ఇప్పటి వరకు బాలీవుడ్‌లో ఏ రీమేక్‌కు చెల్లించనంత ఎక్కువ మొత్తం కరణ్ జోహార్ చెల్లించినట్లవుతుంది. ఎన్టీఆర్ ‘టెంపర్’ సినిమా ‘సింబా’గా రీమేక్ చేశారు. ఇప్పుడు లారెన్స్ ‘కాంచన’ చిత్రాన్ని ‘లక్ష్మీ బాంబ్’గా తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమాల రీమేక్ హక్కులకు చెల్లించిన మొత్తం ప్రస్తుతం కరణ్ జోహార్ చెల్లించనదాని కన్నా చాలా తక్కువ అని అంటున్నారు. వాస్తవానికి సాజిద్ నడియాద్వాలా, భూషణ్ కుమార్, మురద్ ఖేతాని, విజయ్ గలాని వంటి బడా నిర్మాతలు ‘డియర్ కామ్రేడ్’ రీమేక్ హక్కుల కోసం పోటీపడ్డారట. వీరందరికీ షాక్ ఇస్తూ కరణ్ జోహార్ రూ.6 కోట్ల భారీ ధరకు ‘డియర్ కామ్రేడ్’ రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నారట. విజయ్ దేవరకొండ, కరణ్ జోహార్ మధ్య ఉన్న స్నేహం కూడా ఈ రీమేక్ హక్కులు కరణ్‌కు అందేలా చేసిందట. ఈ సినిమా హిందీ రీమేక్‌లో ఇషాన్ ఖట్టర్, జాన్వి కపూర్ హీరోహీరోయిన్లుగా నటించనున్నారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ సినిమా కోసం ఇంకా హీరోహీరోయిన్లను ఖరారు చేయలేదుని ఇటీవల కరణ్ జోహార్ ట్వీట్ చేశారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2ykgyKL
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...