Friday 26 July 2019

‘తూనీగ’ చిత్రానికి త‌నికెళ్ల భ‌ర‌ణి అభినంద‌న

తూనీగ..ఒక దైవ ర‌హ‌స్యం పేరిట వ‌ర్థ‌మాన ద‌ర్శ‌కులు ప్రేమ్ సుప్రీం రూపొందిన ప్ర‌యోగాత్మ‌క చిత్రం. భారీ చిత్రాల‌ను స్ఫురింపజేసేలా అత్యున్న‌త సాంకేతిక అంశాల‌తో రూపొందిన ఓ పురాణేతిహాస ప్ర‌ధాన చిత్రం.భార‌తీయ పురాస్మృతిలో అత్యంత ఆస‌క్తిదాయ‌క క‌థావస్తువుతో రూపొందిన ఈ చిత్ర పోస్ట‌ర్ ను ప్ర‌ముఖ క‌వి, ర‌చ‌యిత, ద‌ర్శ‌కులు త‌నికెళ్ల భ‌ర‌ణి ఆవిష్క‌రించారు. వ‌ర్థ‌మాన ర‌చ‌యిత,ద‌ర్శ‌కులు ప్రేమ్ సుప్రీం రూపొందించిన తూనీగ (ఒక దైవ‌రహ‌స్యం) చిత్ర పోస్ట‌ర్ ను ప్ర‌ముఖ ర‌చ‌యిత, క‌వి, నటు లు, ద‌ర్శ‌కులు త‌నికెళ్ల భ‌రణి ఆవిష్క‌రించారు.హైద్రాబాద్ లో ఆయ‌న స్వ‌గృహం వ‌ద్ద ఈ పోస్ట‌ర్ ను విడుద‌ల చేసి, చిత్ర రూప‌క‌ర్త‌నూ, ఇత‌ర బృందా న్నీ అభినందించారు. తాత్విక చింత‌న నేప‌థ్యంలో సాగే ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించాల‌ని ఆకాంక్షించారు.దేవ‌ర‌హ‌స్యం వెల్ల‌డించే క్ర‌మంలో ఉ త్కంఠ‌త‌ను పెంపొందించే క‌థాంశాన్ని తీసుకుని తెరకెక్కిన ఈ చిత్రంపై అంచ‌నాలు పెంచేలా పోస్ట‌ర్ ను డిజైన్ చేసిన తీరు బాగుంద‌ని అభినందించా రు. భార‌తీయ సంస్కృతిలో అనేకానేక తాత్విక ప‌ర అంశాల‌కు చ‌ర్చ‌కు రాద‌గ్గ అర్హ‌త ఉంద‌ని, ఆ కోవ‌లోనే ఓ ఆస‌క్తిక‌ర అంశాన్ని తీసుకుని ఈ తూ నీగ చిత్రం రూపొందింద‌ని,విజువ‌ల్ ఎఫెక్ట్స్ ప‌రంగా కూడా ఉన్న‌త సాంకేతిక విలువ‌లను పాటించార‌ని వెల్ల‌డించారు.ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌. రా జ‌మౌళి స్ఫూర్తితో ఆయ‌న‌కో గురుద‌క్షిణ అన్న రీ తిలో తెర‌కెక్కిన ఈ చిత్రం కొత్త ఆలోచ‌న‌ల‌కు చిరునామా నిలుస్తుంద‌న్న న‌మ్మ‌కం త‌న‌కుం దని అన్నారు.ద‌ర్శ‌కులు ప్రేమ్ సుప్రీం మాట్లాడుతూ..శ్రీ‌కాకుళం త‌న స్వ‌స్థ‌లం అని,ఇప్ప‌టికే అనేకానేక ల‌ఘు చిత్రాలు రూపొందించాన‌ని, తొ లిసారి పూర్తి నిడివి ఉన్న చిత్రాన్ని రూపొందించడం ఆనం దంగా ఉంద‌ని అన్నారు. క్రౌడ్ ఫండింగ్ ద్వారా ప్రేమ్ పెయింటింగ్స్ ప‌తాకంపై ఈ ప్ర‌యో గాత్మ‌క ప్రాజెక్టు చేపట్టామ‌ని,ఈ చిత్రానికి సంగీతం సిద్ధార్థ్ స‌దాశివుని,ఛాయాగ్ర‌హ‌ణం రిషి ఎదిగ అందించారని, ప‌బ్లిసిటీ డిజైన‌ర్ గా ఎంకేఎస్ మ‌నోజ్ వ్యవ‌హరించార‌ని వెల్ల‌డించారు.ఆగ‌స్టు మొద‌టివారంలో ఆడియో విడుద‌ల కానుంది.ఈ చిత్రానికి పాట సాహిత్యాన్ని బాలాజీ, విశ్వ‌ప్ర‌గ‌డ, కిట్టు త‌ది త‌రులు అందించారన్నారు. వినీత్, దేవయానీ శ‌ర్మ హీరో, హీరోయిన్లుగా ప‌రిచ‌యం అవుతున్న ఈ ప్ర‌యోగాత్మ‌క చిత్రాన్ని అతి త్వ‌ర‌లో విడుద‌ల చేయ‌నున్నామ‌ని తెలిపారు. ప‌ద్మ దేవీ ప్ర‌భ సమ‌ర్ప‌ణ‌లో రూపొందిన ఈ చిత్రానికి శ్రీ‌కాకుళం జిల్లాకు చెందిన ప‌లువురు స‌హ నిర్మాత లుగా వ్య‌వ హ‌రించార‌ని పేర్కొన్నారు. విశాఖ‌ప‌ట్నం,హైద్రాబాద్, బెంగ‌ళూరు న‌గ‌రాల‌తో స‌హా శ్రీ‌కాకుళం జిల్లాలో సీతంపేట మ‌న్యం ప‌రిస‌ర ప్రాంతా ల‌లో చిత్రీకర‌ణ సాగిందన్నారు.పోస్ట‌ర్ విడుద‌ల వేడుక‌లో హీరో వినీత్, సినిమాటోగ్ర‌ఫ‌ర్ రిషి ఎదిగ‌, ప‌బ్లిసిటీ డిజైన‌ర్ ఎంకేఎస్ మ‌నోజ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/2MmQero
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...