తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ (Ajith Kumar) హీరోగా నటించిన ‘తునివు’ (Thunivu) సినిమా తెలుగులో ‘తెగింపు’గా అనువాదమైంది. సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, తమిళనాడులో ఈరోజు తెల్లవారుజాము నుంచే ‘తునివు’ షోలు మొదలయ్యాయి. అక్కడ ఈ సినిమాను చూసినవారు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని వెల్లడిస్తారు. సినిమా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. ఈ సంక్రాంతికి ష్యూర్ షాట్ బ్లాక్ బస్టర్ అని అంటున్నారు. దర్శకుడు హెచ్ఎస్ వినోద్.. యాక్షన్ ఫీస్ట్‌తో పాటు మంచి మెసేజ్ ఇచ్చారని కొనియాడుతున్నారు.
from Samayam: Telugu Movie News | Telugu Cinema News | Tollywood News https://ift.tt/KHvsGYz
v
No comments:
Post a Comment