సూపర్ స్టార్ మహేష్ (Mahesh Babu) నెక్ట్స్ సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) దర్శకత్వంలో చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఆగస్ట్ నుంచి సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఎప్పటిలాగానే త్రివిక్రమ్ భారీగా తారాగణం, బడ్జెట్‌తో సినిమాను రూపొందించడానికి ప్లాన్ సిద్ధం చేశారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో త్రివిక్రమ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. సాధారణంగా అగ్ర హీరోతో పాటు అందులో నటించే వారిని కూడా స్టార్స్‌గా ఉండేలా చూసుకోవటం త్రివిక్రమ్ స్ట్రాటజీ. త్రివిక్రమ్ మాస్టర్ ప్లాన్ అదే!. దాన్నే ఇప్పుడు మహేష్‌తో చేయబోతున్న సినిమా కూడా త్రివిక్రమ్ ఉపయోగిస్తున్నారు. తగ్గట్టే ఈ సినిమాలోనూ భారీ స్టార్ క్యాస్ట్ కనిపించబోతున్నారు. గత కొన్ని రోజులుగా మహేష్ సినిమాలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi), ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasi) లేదా పృథ్వీరాజ్ సుకుమార్‌లలో ఒకరు విలన్‌గా నటిస్తారనే టాక్ అయితే వినిపిస్తోంది. ఎట్టకేలకు విలన్ ఎవరనే దానిపై క్లారిటీ వచ్చేసిందట. సినీ సర్కిల్స్‌లో వినిపిస్తోన్న వార్తల మేరకు కోలీవుడ్ విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ఇందులో విలన్‌గా నటించబోతున్నారట. రీసెంట్‌గానే కథ విన్న ఆయన సినిమా చేయడానికి ఓకే చెప్పేశారట. అధికారిక ప్రకటన కూడా త్వరలోనే వస్తుందని అంటున్నారు.
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/X5B4oeO
v
No comments:
Post a Comment