బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh) న్యూడ్ షో ఇటీవలె ఇంటర్నెట్‌ను షేక్ చేసిన విషయం తెలిసిందే. రీసెంట్‌గా పేపర్ మ్యాగజైన్ కోసం ఆయన ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా (Ranveer Singh Nude Show) ఫొటోలకు పోజులిచ్చాడు. దీంతో రణ్‌వీర్ పేరు ఒక్కసారిగా మీడియాలో మార్మోగిపోయింది. ఆ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవ్వగా.. ఈ స్టార్ హీరోపై భారీ ట్రోలింగ్ జరిగింది. రణ్‌వీర్‌ను కోస్టార్స్ అభినందించగా.. నెట్టింట మీమ్స్ ఓ రేంజ్‌లో పుట్టుకొచ్చాయి. ఈ ట్రోలింగ్‌పై రణ్‌వీర్ కూడా తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. అందరి ముందు నగ్నంగా ఫొటోలకు పోజులు ఇవ్వడం తనకు కష్టం కాదని.. వేల మంది ఉన్నా కూడా తాను నగ్నంగా ఉండగలనని అన్నారు. అయితే ప్రజలు ఇబ్బందిగా ఫీలయితే తానేం చేయలేనని చెప్పారు. ఈ ఫొటోలలో తన ఆత్మను చూడొచ్చంటూ చెప్పొకొచ్చారు ఈ స్టార్ హీరో. అయితే రణ్‌వీర్ కంటే ముందు ఎవరు న్యూడ్ షోలో పాల్గొన్నారని నెటిజన్లు ఆసక్తిగా వెతుకున్నారు. ఈ స్టార్ హీరో కంటే ముందు చాలా ధైర్యం చేసి నగ్నంగా ఫొటోలకు పోజులిచ్చిన సెలబ్రిటీలు వీళ్లే..
from Telugu Movie News | Telugu Cinema News - Samayam Telugu https://ift.tt/y5MtZBp
v
No comments:
Post a Comment