Friday 4 March 2022

ప్రభాస్ హీరోయిన్‌కి అశ్లీల మెసేజెస్.. ఫొటోగ్రాఫర్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు

న‌టి సంజన గల్రానికి ఓ ఫొటోగ్రాప‌ర్ అర్ద‌రాత్రి స‌మ‌యంలో కొన్ని అశ్లీల మెసేజ్‌లు పంపాడు. దీనిపై ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. సంజ‌నకు ఇది వ‌ర‌కు ఆడం బిడ్డ‌ప్ప అనే ఫొటోగ్రాఫ‌ర్‌తో ప‌రిచ‌యం ఉండేది. సంజ‌న పెళ్లి చేసుకున్న త‌ర్వాత త‌న లైఫ్ త‌న‌దిగా ఉంటుంది. ఈ క్ర‌మంలో ఆడం బిడ్డ‌ప్ప ఆమె ఫోన్ అశ్లీల మెసేజ్‌లు, వీడియోలు పంపాడు. త‌ను పంపిన మెసేజ్‌ల‌పై అభ్యంత‌రం వ్య‌క్తం చేశాన‌ని కూడా సంజ‌న త‌న కంప్లైంట్‌లో పేర్కొంది. విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు ఆడంబిడ్డ‌ప్ప పిలిచి విచారించ‌గా, తానెలాంటి అశ్లీల మెసేజ్‌లు పంప‌లేద‌ని అత‌డు చెప్పాడు. పోలీసులు ఫోన్‌ను చెక్ చేయ‌గా అందులో చాట్ చేసిన ఆధారాలు దొర‌క‌లేదు. దాంతో వారు.. ఆ ఫోన్‌ని ఫొర్సెనిక్ ప్రయోగ‌శాల‌కు పంపారు. కేసు విచార‌ణ‌లో ఉంది. ప్ర‌భాస్ హీరోగా చేసిన సినిమాల్లో బుజ్జిగాడు మేడిన్ చెన్నై సినిమా అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. అందులో ప్ర‌భాస్ మేన‌రిజంకు మంచి మార్కులే ప‌డ్డాయి. అందులో ఇద్ద‌రు హీరోయిన్స్ ఒక‌రేమో త్రిష.. కాగా మ‌రొక‌రు సంజ‌న గ‌ల్రాని. త‌ర్వాత ఈమె కొన్ని తెలుగు సినిమాల్లోనూ, త‌మిళ‌, క‌న్న‌డ చిత్రాల్లోనూ న‌టించింది. ఇటీవ‌ల డ్రగ్స్ కేసులో అరెస్ట్ కూడా అయ్యింది. మూడు నెలలు జైలు జీవితం తర్వాత బయటకు వచ్చి డాక్ట‌ర్ అజీజ్ భాషా అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లు ముందు ఆమె ఇస్లాం మ‌తం స్వీక‌రించింది. అదే నేప‌థ్యంలో ఆమె భ‌ర్త నుంచి విడిపోతుంద‌నే వార్త‌లు కూడా వ‌చ్చాయి. అయితే ఆ వార్త‌ల్లో నిజం లేద‌ని, త‌న కాపురం స‌వ్యంగా సాగుతుంద‌ని ఆమె తెలియ‌జేసింది. ఆ మ‌ధ్య పెళ్లి, డ్ర‌గ్స్ కేసు అంటూ వార్త‌ల్లో నిలిచిన సంజ‌న గ‌ల్రాని ఇప్పుడు మ‌ళ్లీ ఇలా వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలిచింది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/w46c9Eg
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...