Saturday 5 March 2022

ఇకపై త్రివిక్ర‌మ్‌తో సినిమా అంటే అంత ఇవ్వాల్సిందేన‌ట‌.. గురూజీ అంటే అంతే మ‌రి!

మాట‌ల మాంత్రికుడు, స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్‌. ఈయ‌న ఎక్కువ‌గా హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌, సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర‌ర్స్‌లోనే సినిమాలు చేస్తుంటారు. ఈ రెండు బ్యాన‌ర్స్‌లో వేరే ద‌ర్శ‌కులు చేసే ప‌నిని కూడా ఈయ‌న పర్య‌వేక్షిస్తుంటార‌ని కూడా బ‌య‌ట టాక్ విన‌ప‌డుతుంది. రీసెంట్‌గా ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం భీమ్లా నాయ‌క్ సినిమాను కూడా ఆయ‌నే ద‌గ్గ‌రుండి చూసుకున్నారు. స్క్రీన్ ప్లే, మాటలు అందించ‌డంతో పాటు ఓ పాట కూడా రాసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు త్రివిక్ర‌మ్ రెండు బాధ్య‌త‌లను కొత్త ప‌ర్య‌వేక్షిస్తున్నారు. అందులో ఒక‌టి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కోసం. ఆయ‌న త‌మిళ చిత్రం వినోద‌య సిత్తంను రీమేక్ చేస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. త‌మిళ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల నెటివిటీకి అనుగుణంగా మార్చే ప‌నిలో ఉన్నారు. కాగా.. మరో బాధ్య‌త త‌నే మ‌హేష్‌ను హీరోగా పెట్టి చేస్తున్న సినిమా వ్య‌వ‌హారాల‌ను ప‌ర్య‌వేక్షించ‌డం. తాజాగా.. మ‌హేష్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొంద‌బోయే సినిమా గురించి ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట తెగ చ‌క్క‌ర్లు కొడుతుంది. అదేంటంటే.. త్రివిక్ర‌మ్ రెమ్యున‌రేష‌న్‌. మ‌హేష్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొంద‌నున్న సినిమా కోసం మాట‌ల మాంత్రికుడికి భారీ మొత్తం ద‌క్క‌నుంద‌ట‌. అల వైకుంఠ‌పుర‌ములో చిత్రానికి త్రివిక్ర‌మ్‌కు దాదాపు పాతిక కోట్ల రూపాయ‌లు రెమ్యున‌రేష‌న్‌గా ద‌క్కింద‌ని టాక్‌. కాగా.. ఇప్పుడు మ‌హేష్‌తో చేయ‌బోయే సినిమాకు గురూజీకి యాబై కోట్ల రూపాయ‌ల మొత్తం రెమ్యున‌రేష‌న్‌గా ద‌క్కుతుంద‌ని వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇదే క‌నుక నిజ‌మైతే రాజ‌మౌళి త‌ర్వాత ఆ రేంజ్‌లో భారీ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న వారిలో త్రివిక్ర‌మ్ రెండో స్థానంలో నిలుస్తారు. ప్ర‌స్తుతం మ‌హేష్ ‘స‌ర్కారు వారి పాట‌’ చిత్రీకరణను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తవగానే, దర్శకత్వంలో సినిమా సెట్స్ పైకి వెళుతుంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/yBnbDu3
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...