Friday 4 March 2022

రౌడీ హీరోతో స‌మంత‌..రెమ్యున‌రేష‌న్‌లో త‌గ్గేదే లే అంటున్న చెన్నై బ్యూటీ!

అభిమానులు ముద్దుగా ఆయ‌న్ని అభిమానంతో రౌడీ స్టార్ అని పిలుచుకుంటే, ఆయ‌నేమో త‌న ఫ్యాన్స్ , ఫాలోవ‌ర్స్‌ను రౌడీస్ ప్రేమ‌తో రౌడీస్ అని పిలుస్తుంటారు. త‌నెవ‌రో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు... విజ‌య్ దేవ‌ర‌కొండ‌. ఇప్పుడు ‘లైగ‌ర్‌’తో పాన్ ఇండియా హీరోగా ప్రేక్ష‌కుల‌ను ప‌క‌ల‌రించ‌బోతున్న విష‌యం తెలిసిందే. లైగ‌ర్ సినిమాను పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న‌తో పాటు ఛార్మి, క‌ర‌ణ్ జోహార్ క‌లిసి నిర్మిస్తున్నారు. ఆగ‌స్ట్ 25న సినిమా భారీ రేంజ్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతుందీ చిత్రం. ఇది పూర్తి కాక మునుపే విజ‌య్ దేవ‌ర‌కొండ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలోనే ‘జనగణమన’ సినిమాను చేయ‌డానికి ఓకే చెప్పేశారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ల‌నుంది. ఈ సినిమాను వీలైనంత త్వ‌ర‌గానే పూర్తి చేస్తారు. ప‌రిస్థితి చూస్తుంటే విజ‌య్ దేర‌వ‌కొండ‌తో సినిమా చేయ‌డానికి చాలా కాలంగా వెయిటింగ్‌లో ఉన్న ద‌ర్శ‌కుడు కొన్ని నెల‌లు ఆగ‌క త‌ప్పేలా లేదు. అయితే శివ నిర్వాణ స్క్రిప్ట్ వ‌ర్క్‌ను మెరుగులు దిద్ద‌డంతో పాటు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తి చేయ‌డంలో బిజీగా ఉన్నారు. తాజా సినీ స‌ర్కిల్స్ స‌మాచారం మేర‌కు ఈ చిత్రంలో చెన్నై బ్యూటీ స‌మంత‌ హీరోయిన్‌గా న‌టించ‌నుంద‌ట‌. అంతే కాదండోయ్‌.. ఈ సినిమా కోసం స‌మంత భారీ రెమ్యున‌రేష‌న్ డిమాండ్ చేసింద‌ట‌. మూడు కోట్ల రూపాయ‌ల‌ను అడగ్గా మేక‌ర్స్ కూడా ఓకే చెప్పిన‌ట్లు టాక్‌. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంది. ఇది వ‌ర‌కు విజ‌య్ దేవ‌ర‌కొండ‌, స‌మంత.. మ‌హాన‌టి చిత్రంలో జోడీగా న‌టించిన సంగ‌తి తెలిసిందే. అందులో వారి పాత్ర‌లు ప‌రిమిత‌మే అయినా.. చాలా కీల‌క‌మైన‌వి. ఇప్పుడు శివ నిర్వాణ సినిమాలో మ‌రోసారి జంట‌గా మెప్పించ‌బోతున్నారు. శివ నిర్వాణ డైరెక్ష‌న్‌లో ఘ‌న విజ‌యం సాధించిన ‘మజిలీ’ చిత్రంలో స‌మంత‌నే హీరోయిన్‌. అదే సెంటిమెంట్‌తో శివ ఆమెను హీరోయిన్‌గా చేయాల‌ని అప్రోచ్ కావ‌డం జరిగింద‌ట‌. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా మూవీగానే రిలీజ్ చేసేలా మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ని కూడా వార్త‌లు వినిపిస్తున్నాయి.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/JvE3zwH
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...