Wednesday 2 March 2022

ఆడదానికి విలువ లేదా? ఇంకెన్ని రోజులు ఇలా.. కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష

సృష్టికి మూలం ఆడది. ఈ ప్రపంచంలో స్త్రీ లేనిదే జననం లేదు. స్త్రీ లేనిదే గమనం లేదు. తల్లిగా, చెల్లిగా, భార్యగా పలు బాధ్యతలు మోస్తూ సర్వం త్యాగం చేస్తుంది మహిళ. ప్రతి మగాడి విజయం వెనుక ఓ స్త్రీ ఉంటుందనేది పెద్దలు చెప్పిన మాట. అది అక్షరాలా నిజం అని అంగీకరించే ఈ సమాజం.. అదే స్త్రీ పట్ల వివక్ష చూపుతూ మొండిగా వ్యవహరిస్తుంటుంది. సభ్యసమాజంలో స్త్రీని ఓ ఆటబొమ్మలా చూడటం తరచుగా ఎక్కడోచోట చూస్తూనే ఉంటాం. ఇక స్త్రీ మూర్తిపై జరుగుతున్న అత్యాచారలైతే క్షమించరాని నేరాలు. ఇలాంటి సంఘటనలే సమాజ దుస్థితిని అద్దం పడుతున్నాయి. ఇదే విషయమై ఎమోషనల్ అయింది. ప్రతి ప్రత్యేకమైన రోజున బుల్లితెరపై స్పెషల్ ప్రోగ్రామ్స్ ప్రసారం చేస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఓ ప్రత్యేకమైన ప్రోగ్రాం ప్లాన్ చేసింది శ్రీదేవి డ్రామా కంపెనీ టీమ్. ఈ మేరకు కంటిస్టెంట్స్ తల్లులను గెస్టులుగా తీసుకొచ్చి ఈ వేదిపై గౌరవప్రదమైన సత్కారం చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా అందులోని కొన్ని సన్నివేశాలు పలువురి చేత కంటతడి పెట్టిస్తున్నాయి. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, ఇమ్మానుయేల్, వర్ష, జోర్దార్ సుజాత సహా పలువురు కంటిస్టెంట్లతో ఈ ప్రోగ్రాం రూపొందించారు. ఇందులో పెళ్ళాం మాట విని ఇమ్మానుయేల్ తన తల్లిని ఇంట్లో నుంచి గెంటివేసిన సీన్ చూసి అక్కడున్న ప్రతి ఒక్కరూ ఎమోషనల్ అయ్యారు. నేను నెల తప్పానంటూ జోర్దార్ సుజాత తన భర్తతో చెబితే, ఈ సారి కూడా ఆడబిడ్డ పుడితే అంటూ ఆమెను కొట్టిన సీన్ అందరి హృదయాలను కలచి వేసింది. అయితే ఈ సీన్స్ చూసిన వర్ష.. తన దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. ఇప్పుడు చూసినవన్నీ బయట జరుగుతూనే ఉన్నాయి అని చెబుతూ ఆడవాళ్లకు విలువ లేదా? ఇంకెన్ని రోజులు ఇలా.. అంటూ కంటతడి పెట్టుకుంది. మొత్తంగా చూస్తే ఆడదాన్ని ఆటబొమ్మగా చూసే ప్రతి ఒక్కరికీ బుద్ది చెప్పేలా ఈ ప్రోమో వీడియో కట్ చేశారని చెప్పుకోవచ్చు.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/0y7vZbo
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...