Wednesday, 2 February 2022

ప్రభాస్ ఇంట పెళ్లి పనుల్లో అనుష్క శెట్టి.. ఇదిగో ఫొటో ప్రూఫ్!

టాలీవుడ్ అగ్ర కథానాయిక శెట్టి, వెండితెరపై కనిపించి రెండేళ్లు అవుతుంది. నాలుగు ప‌దులు వ‌య‌సు దాటిన అనుష్క శెట్టి పెళ్లి ఎప్పుడు అనే దానిపై సోష‌ల్ మీడియాలో ప‌లు ర‌కాలుగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. ఒకానొక ద‌శ‌లో అంటే బాహుబ‌లి స‌మ‌యంలో టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్ర‌భాస్‌, అనుష్క ప్రేమ‌లో ఉన్నార‌ని, త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకుంటార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే ప్ర‌భాస్‌, అనుష్క తాము మంచి స్నేహితుల‌మ‌ని చెప్పేశారు. ప్ర‌భాస్‌, అనుష్క ఎంత మంచి స్నేహితులంటే, ప్ర‌భాస్ ఇంట్లో శుభ కార్యాల‌కు అనుష్క త‌ప్ప‌కుండా హాజ‌ర‌వుతుంటుంది. రీసెంట్‌గా రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు స్టాఫ్ స‌భ్యురాలి కుమార్తె పెళ్లి జ‌రిగింది. ఆ పెళ్లికి అనుష్క హాజ‌రైంద‌ని సినీ వ‌ర్గాల్లో బ‌ల‌మైన వార్త‌లు వినిపించాయి. పెళ్లికి వెళ్ల‌డ‌మే కాదు, వాళ్లింటి మ‌నిషిలాగా క‌లిసిపోయి పెళ్లి ప‌నులు కూడా చేసింద‌ని, అందుకు ఓ ఫొటోనే సాక్ష్య‌మ‌ని అంటున్నారు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు. ఆ ఫొటోను గ‌మ‌నిస్తే.. అందులో ప‌నుల హ‌డావిడిలో ఉంటూ ఏదో దీపం అమ‌ర్చుతున్నారు. అనుష్క చాలా మంచి వ్య‌క్తి అని సినీ సర్కిల్స్ స‌మాచారం. కృష్ణంరాజు స్టాఫ్ కుమార్తె పెళ్లికి వెళ్ల‌డం.. ఫ్రెండ్ షిప్ కోసం ఆమె అలా ప‌నులు చేయ‌డం అనేది నిజ‌మైతే మ‌త్రం నిజంగా ఆమెను అభినందించాల్సిందే. ఫొటో చూసిన త‌ర్వాత ప్ర‌స్తావించాల్సిన విష‌య‌మేమంటే.. అనుష్క లుక్ ఈ ఫొటోలో పూర్తిగా మారిపోయింది. సైజ్ జీరోలో అనుష్క చాలా బ‌రువు పెరిగారు. ఆ బ‌రువు త‌గ్గించుకోవ‌డానికి ఆమె చాలానే క‌ష్ట‌ప‌డ్డారు. ముఖ్యంగా సైలెన్స్ త‌ర్వాత అనుష్క సినిమాల్లో న‌టించ‌లేదు. పూర్తిగా త‌న లుక్‌ను మార్చుకోవ‌డంపైనే ఆమె దృష్టి పెట్టిన‌ట్లు వార్త‌లు వినిపించాయి. ఈ ఫొటోను గ‌మ‌నిస్తే ఆ వార్త‌లు నిజ‌మని ఒప్పుకోక త‌ప్ప‌దు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. 2020లో అనుష్క శెట్టి, మాధ‌వ‌న్ న‌టించిన సైలెన్స్ విడుద‌లైంది. అది కూడా ఓటీటీ రిలీజ్. త్వరలోనే నవీన్ పొలిశెట్టితో అనుష్క న‌టించ‌నుంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేష‌న్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/npjg0WRCX
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...