Wednesday, 2 February 2022

బాల‌య్య‌పై అభిమానాన్ని ఎలా చాటుకున్నాడో చూడండి.. ‘అఖండ’ పేరుతో ఫ్యాన్ చేసిన పని చూస్తే ఆశ్చర్యపోతారు..!

అభిమానులందూ వీర‌భిమానులు లెక్కే వేరుగా ఉంటుంది. త‌మ అభిమాన క‌థానాయ‌కుడి గురించి త‌గ్గేదే లే అంటూ ఏదైనా చేసేయ‌డానికి వారు రెడీ అయిపోతారు. ఇలాంటి ఫ్యాన్స్ కార‌ణంగానే స్టార్ హీరోల సినిమాల‌కు వ‌చ్చే ఓపెనింగ్ క‌లెక్ష‌న్స్ మ‌రో రేంజ్‌లో ఉంటాయి. అలాంటి వీరాభిమానులు మెండుగా ఉన్న టాలీవుడ్ అగ్ర హీరోల్లో నంద‌మూరి బాల‌కృష్ణ ఒక‌రు. గ‌త ఏడాది కోవిడ్ థ‌ర్డ్ వేవ్ కార‌ణంగా సినిమా థియేట్స్‌కు ప్రేక్ష‌కులు వ‌స్తారా? రారా? అని నిర్మాత‌లు ఆలోచిస్తున్న త‌రుణంలో సినిమాను విడుద‌ల చేసి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించారు. థియేట‌ర్స్‌లోనే కాదండోయ్‌..ఓటీటీలోనూ అఖండ సాధించిన విజ‌యం గురించి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇంత పెద్ద విజ‌యాన్ని సాధించిన త‌న అభిమాన హీరోను చూసి ఉప్పొంగి పోయిన ఓ నంద‌మూరి అభిమాని త‌న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. తిరుప‌తిలో ఉండే ఓ బాల‌కృష్ణ అభిమాని అఖండ పేరుతో ఓ హోట‌ల్‌ను స్టార్ట్ చేశారు. ఇది తిరుప‌తి సిటీలో టాక్ ఆఫ్ ది సిటీగా మారింది. బాల‌య్య‌పై ఇలా త‌న అభిమానాన్ని చాటుకున్న స‌ద‌రు అభిమానిని హోటల్ ఫొటోను ఇత‌ర నంద‌మూరి బాల‌య్య అభిమానులు ఫొటోలు తీసి సోష‌ల్ మీడియా ద్వారా షేర్ చేస్తున్నారు. స‌రే! ఎవ‌రి అభిమానం వారిది. నంద‌మూరి బాల‌కృష్ణ‌, డైరెక్టర్ బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మూడో సినిమా అఖండ‌. ద్వారకా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా లైఫ్ టైమ్ రెండు మూడు వారాల‌కు చేరుకున్న నేటి రోజుల్లో అఖండ ఏకంగా 50 రోజులను 103 సెంట‌ర్స్‌లో పూర్తి చేసుకుంది. అలాగే వ‌సూళ్ల ప‌రంగానూ రూ.200 కోట్లను సాధించింది. ప్ర‌గ్యా జైశ్వాల్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో శ్రీకాంత్ విల‌న్‌గా న‌టించారు. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ త‌న 107వ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కిస్తున్నారు. శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ న‌టిస్తున్నారు. నాలుగు భాష‌ల్లో సినిమా విడుద‌ల‌వుతుంద‌ని స‌మాచారం.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/AjR4wUa3p
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...