Thursday, 3 February 2022

లాంఛ‌నంగా ప్రారంభ‌మైన మ‌హేష్ - త్రివిక్ర‌మ్ మూవీ

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, స్టార్ డైరెక్టర్ కాంబినేషన్‌లో కొత్త చిత్రం గురువారం లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. శ్రీమతి మమత సమర్పణలోటాలీవుడ్ అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్య‌దేవ‌ర రాధా కృష్ణ ‌(చిన‌బాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్ర కథానాయిక పూజ హెగ్డే పై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి సూపర్ నమ్రత శిరోద్కర్ క్లాప్ నిచ్చారు. ప్రముఖ పారిశ్రమికవేత్త సురేష్ చుక్కపల్లి కెమెరా స్విచాన్ చేశారు. మ‌హ‌ర్షి త‌ర్వాత మ‌హేష్‌తో జోడీ క‌డుతున్న చిత్ర‌మిదే. అతడు, ఖ‌లేజా చిత్రాల త‌ర్వాత మ‌హేష్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూవీ ఇది. ఖ‌లేజా 2010లో విడుద‌లైంది. దాదాపు 11 ఏళ్ల త‌ర్వాత మ‌రోసారి వీరిద్ద‌రూ క‌లిసి చేస్తుండ‌టం విశేషం. సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఏప్రిల్ నుంచి జ‌ర‌గ‌నుంది. త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యం వ‌హించ‌నున్నారు. వ‌రుస విజ‌యాల‌తో ఉన్న స్టార్ డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో చాలా గ్యాప్ త‌ర్వాత మ‌హేష్ సినిమా చేస్తున్నాడ‌ని అనగానే అంచ‌నాలు పెరిగాయి. మ‌హేష్‌ను త్రివిక్ర‌మ్ ఎలా చూపిస్తాడోన‌ని సూప‌ర్ స్టార్ ఫ్యాన్స్ చాలా ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు. త‌న సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ మ‌హేష్ పూజా కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌లేదు. ప్ర‌స్తుతం మ‌హేష్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘స‌ర్కారు వారి పాట‌’. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీ మేక‌ర్స్‌, 14 రీల్స్ ప్ల‌స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్స్‌పై సినిమా నిర్మిత‌మ‌వుతుంది. సినిమా షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. సినిమాను మే 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లవుతుది. మేక‌ర్స్ దానికి సంబంధించిన అనౌన్స్‌మెంట్‌ విడుద‌ల చేశారు. మ‌రో వైపు త్రివిక్ర‌మ్ భీమ్లా నాయ‌క్ సినిమాకు సంబంధించిన వ‌ర్క్‌ను పూర్తి చేశారు. గత ఏడాది సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో హిట్ అందుకున్న ఈ ఏడాది కూడా సంక్రాంతికి సర్కారు వారి పాట చిత్రంతో వరుస హిట్ కొట్టాలనుకున్నారు. అయితే కరోనా థర్డ్ వేవ్ కారణంగా సినిమాను ఇప్పుడు మే 12కి వాయిదా వేశారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/n96mdgRs0
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...