టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్‌లో బోయపాటి శ్రీను ఒకరు. హీరోను మాస్ యాంగిల్‌లో ప్రెజంట్ చేయడంలో ఆయనదొక సెపరేట్ స్టైల్. ఆయన మేకింగ్ కూడా భారీ రేంజ్‌లో ఉంటుంది. బోయపాటి శీను సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ కూడా, యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఆకట్టుకునేలా ఉంటాయి.రవితేజ, వెంకటేష్, బాలకష్ణ, ఎన్టీఆర్, రామ్ చరణ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వంటి వారితో సినిమాలను తెరకెక్కించారు. డైరెక్టర్‌గా మంచి ఇమేజ్ సంపాదించుకున్న బోయపాటి శ్రీనుకి ఓ చెడు అలవాటు ఉందట. ఇది నిజం.. ఈ విషయాన్ని ఓ సీనియర్ యాక్టర్ చెప్పడం గమనార్హం. ఇప్పటి వరకు బోయపాటి శ్రీనుకి ఉన్న చెడు అలవాటు ఏంటనే విషయం ఇండస్ట్రీ వర్గాలకే పరిమితమై ఉండేది. కానీ.. ఓ సీనియర్ స్టార్ ఆ గుట్టుని బయట పెట్టడంతో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఇంతకీ బోయపాటి శ్రీనుకి ఉన్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటో తెలుసా?.. బూతులు మాట్లాడటం. ఆయన సెట్స్‌లో వర్కింగ్ టైమ్‌లో తెలియకుండానే బూతులు మాట్లాడుతుంటారట. మళ్లీ బయట కూల్‌గా, సాధారణంగానే మాట్లాడుతుంటారట. ఇంతకీ ఈ విషయాన్ని చెప్పిన సీనియర్ యాక్టర్ ఎవరో తెలుసా? జగపతిబాబు. బోయపాటి శ్రీను, జగపతి బాబుకి మంచి అనుబంధం ఉంది. ఓ పెద్ద డైరెక్టర్ సెట్స్‌లో అలా బూతులు మాట్లాడటం జగపతి బాబుకి నచ్చలేదట. దాంతో ఆయన పదే పదే బోయపాటిని బూతులు మాట్లాడటం తగ్గించుకోవాలని చెబుతూ వచ్చారట. ఆయనతో వర్క్ చేసిన సీనియర్ హీరోలు, ఇతరులు కూడా బోయపాటికి ఇదే సూచన చేశారట. అందరూ మాటలలను అర్థం చేసుకున్న బోయపాటి ఇప్పుడు సెట్స్‌లో బూతులు మాట్లాడటం పూర్తిగా తగ్గించేశారని రీసెంట్ ఇంటర్వ్యూలో జగపతిబాబు చెప్పారు. అఖండ సినిమా షూటింగ్ సమయంలో బోయపాటి శ్రీను చాలా కూల్‌గా, నార్మల్‌గా వర్క్ చేయడం తనకు ఆశ్చర్యాన్ని కూడా కలిగించిందని, బోయపాటి అలా మారడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని కూడా జగపతి బాబు ఈ సందర్భంగా తెలియజేశారు. బోయపాటి కారణంగా కెరీర్ టర్నింగ్ తీసుకున్న వారిలో జగపతి బాబు ఒకరు. హీరోగా ఆయన కెరీర్ అయిపోయిందని అందరూ అనుకుంటున్న తరుణంలో లెజెండ్ సినిమాతో జగపతి బాబుని విలన్‌గా సరికొత్త కోణంలో ఆవిష్కరించారు బోయపాటి శ్రీను. ఆ సినిమా పెద్ద సక్సెస్ కావడం. జగపతి బాబుకి మంచి పేరు రావడంతో ఆయన విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఫుల్ బిజీగా మారారు. రీసెంట్‌గా బోయపాటి దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ అయిన అఖండ సినిమాలోనూ జగపతి బాబు ఓ కీలక పాత్రలో నటించారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/s6jMBco
v
No comments:
Post a Comment