సోషల్ మీడియాలో యమ యాక్టివ్ రోల్ పోషిస్తున్న స్టార్ హీరోయిన్ సమంత.. నిత్యం ఏదో ఒక రకంగా తన అభిమానులతో టచ్ లోకి వస్తోంది. ఎప్పటికప్పుడు ఆమె పోస్ట్ చేస్తున్న ఫొటోలు, కొటేషన్స్ వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్యతో విడాకుల అనంతరం మరింత యాక్టివ్ అయిన తనను తాను మోటివేట్ చేసుకుంటూ పలు మోటివేషన్ కొటేషన్స్ తన అభిమానులతో పంచుకుంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా 'నిజం' అంటూ తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో సమంత పెట్టిన ఓ కొటేషన్ వైరల్ అవుతోంది. జీవితానికి అనేది ఎంతో బలమంటూ ఈ మోటివేషనల్ కొటేషన్ ద్వారా పేర్కొంది సమంత. ''క్రమశిక్షణగా ఉండాలని ఎవరో చెప్పాల్సిన పనిలేదు, క్రమశిక్షణతో మెదలడం ఎంతో బలాన్నిస్తుంది. జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి ఇదే పునాది కూడా. క్రమశిక్షణతో ఉండటం వల్ల మనం కోరుకున్నవన్నీ మన దరి చేరుతాయి'' అని పేర్కొంది సమంత. దీంతో ఈ పోస్ట్ చూసిన ఆమె ఫ్యాన్స్ మీరు చెప్పినట్లుగా ఇదే నిజం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే విడాకుల అనంతరం తనకు నచ్చినట్లుగా ఉంటూ కెరీర్‌పై పూర్తి ఫోకస్ పెట్టింది సమంత. వీలు కుదిరినప్పుడల్లా స్నేహితులతో కలిసి టూర్స్ వేస్తూనే బిజీ బిజీ షెడ్యూల్‌తో వరుస సినిమాలు చేస్తోంది. ఇటీవలే 'పుష్ప' మూవీలో ఐటెం సాంగ్ చేసిన మెప్పించిన సామ్.. గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' మూవీ కంప్లీట్ చేసింది. ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్టు 'యశోద'తో బిజీగా ఉంది. తమిళంలో ఆమె నటించిన 'కాతు వాక్కుల రెండు కాదల్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు కోలీవుడ్, బాలీవుడ్ చిత్రాల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తూ వస్తోంది సమంత.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/p1jq0Zt
v
No comments:
Post a Comment