తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన గాయకుడు రేవంత్ ఓ ఇంటి వాడయ్యారు. ఆదివారం (ఫిబ్రవరి 6) రోజున ఆయన వివాహం గుంటూరుకి చెందిన అన్వితతో జరిగింది. గుంటూరులోని ఓ ఫంక్షన్ హాలులో ఈ వివాహ వేడుకను నిర్వహించారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా కుటుంబ సభ్యులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు సహా పరిమిత సంఖ్యలతో బంధు మిత్రులు ఈ పెళ్లి వేడుకకి హాజరయ్యారు. అలాగే పలువురు గాయనీ గాయకులు కూడా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. రేవంత్ - పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీరి నిశ్చితార్థం డిసెంబర్ 24న జరిగింది. సప్త స్వరాలు అనే సంగీత కార్యక్రమం ద్వారా రేవంత్ గాయకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. పలు షోస్‌లో ఆయన పాల్గొన్నారు. అలాగే తెలుగు సినిమాల్లో ప్లే బ్యాక్ సింగర్‌గానూ తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు. జై చిరంజీవి, బాహుబలి, దమ్ము, జై చిరంజీవ, అర్జున్ రెడ్డి, ఆచార్య వంటి పలు చిత్రాల్లో రేవంత్ పాటలు పాడి తనదైన గుర్తింపును సంపాదించుకున్నారు.
from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/z7PwNWo
v
No comments:
Post a Comment