Sunday, 6 February 2022

విడాకుల కాన్సెప్ట్‌ అనగానే డిసైడ్ అయ్యా.. సుమంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా రెండు దశాబ్దాల క్రిందటే 'ప్రేమ కథ' మూవీతో సినీ ఎంట్రీ ఇచ్చిన .. ఆ తర్వాత ''యువకుడు, సత్యం, గౌరీ, గోదావరి'' లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. అయితే ఆ తర్వాత కెరీర్ పరంగా కొన్ని ఫ్లాప్స్ రావడంతో కొంత గ్యాప్ తీసుకున్న ఈ అక్కినేని కాంపౌండ్ హీరో 'మళ్ళీ రావా' సినిమాతో తిరిగి ట్రాక్ ఎక్కారు. అదే జోష్‌లో ఇప్పుడు '' అంటూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో ఈడీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రూపొందిన ఈ 'మళ్ళీ మొదలైంది' సినిమాకు రాజశేఖర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించగా.. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. పనులన్నీ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్దమైన ఈ సినిమా హక్కులను ZEE 5 ఓటీటీ దక్కించుకుంది. ఫిబ్రవరి 11వ తేదీన ఓటీటీలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్ చేపట్టారు. ఇందులో భాగంగా ఓ సమావేశంలో హీరో సుమంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మళ్ళీ మొదలైంది' సినిమా కథ చెప్పే సమయంలో ఇది విడాకుల నేపథ్యంలో ఉంటుందని చెప్పగానే వెంటనే ఓకే చెప్పేశానని సుమంత్ అన్నారు. విడాకుల కాన్సెప్ట్‌తో సినిమా అనగానే ఈ మూవీ చేయాలని వెంటనే డిసైడ్‌ అయ్యానని, ఇలాంటి కథను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకూడదని అనుకున్నానని తెలిపారు. విడాకులు తీసుకున్న ఓ యువకుడు, తన న్యాయవాదితో ప్రేమలో పడితే? అనే ఇతివృత్తంతో ఈ సినిమా రూపొందింది. చిత్రంలో సుమంత్ భార్యగా వర్షిణీ సౌందర్ రాజన్, న్యాయవాది పాత్రలో నైనా గంగూలీ నటించారు. సో.. చూడాలి మరి ఓటీటీ వేదికపై అక్కినేని కాంపౌండ్ హీరో సుమంత్ విడాకుల కాన్సెప్ట్ ఎంత మేర రెస్పాన్స్ అందుకుంటుందనేది!.


from Telugu Movie News | Movie News in Telugu | Movie Gossips in Telugu https://ift.tt/YZUQx9D
v

No comments:

Post a Comment

చంద్రబాబు అరెస్ట్‌ను తప్పుబట్టిన దర్శకేంద్రుడు.. తిట్టిపోస్తున్న వైసీపీ అభిమానులు

చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అరెస్ట్‌పై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు (K Raghavendra Rao) స్పందించారు. దీంతో రాఘవేంద్రరావును వైసీపీ...